దాచవరం గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం
మనభారత్ న్యూస్, 07 జులై 2023, ఆంధ్రప్రదేశ్ : NTR జిల్లా / వీరులపాడు మండలం :
దాచవరం గ్రామంలో "గడపగడపకు -మన ప్రభుత్వం" కార్యక్రమం నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ప్రజల ముంగిట్లో ప్రజారంజక పాలన : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
సుపరిపాలనకు మరోసారి పట్టం కట్టుకున్న ప్రజలు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
వీరులపాడు మండలంలోని "దాచవరం" గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల బుక్ లెట్ లను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రజలకు అందజేశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 98% అమలు చేసి, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాల అమలతో ప్రజల ముంగిట్లోనే ప్రజా రంజక పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేసి దేశంలోనే చరిత్ర సృష్టించిన వైయస్ జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, జగనన్న విద్యా కిట్లు, గోరుముద్ద, వసతి దీవెన, నాడు- నేడు వంటి కార్యక్రమాలు ప్రభుత్వ విద్య బలోపేతానికి ఎంతో దోహదపడ్డాయని వివరించారు. 108, వైయస్సార్ ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్ విధానం వంటి కార్యక్రమాలు పేదలకు నాణ్యమైన వైద్యాన్ని దరిచేర్చిందని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో ప్రపంచంలోనే గొప్ప కార్యక్రమాలు మన ప్రభుత్వంలో జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికలు ఏడాది లోగానే ఉన్నాయని, జాతీయ స్థాయి సంస్థలు ఇటీవల నిర్వహించిన సర్వేల్లో వైయస్సార్సీపీ మరోసారి విజయకేతనం ఎగురవేయనున్నదని తెలిపోయిందని వెల్లడించారు. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ సుపరిపాలనకు ప్రజలు మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోటేరు లక్ష్మి ముత్తారెడ్డి, జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య, మండల కన్వీనర్ ఆవుల రమేష్ బాబు, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం, వైస్ ఎంపిపి ఆదాం, గ్రామ సర్పంచ్ రామిశెట్టి రత్న ప్రసాద్, గ్రామ పార్టీ కన్వీనర్ తోట హరీష్ తదితరులు పాల్గొన్నారు ..
What's Your Reaction?