అమ్మవారిని దర్శించుకున్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు

అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

Oct 17, 2023 - 17:48
 0
అమ్మవారిని దర్శించుకున్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 17.10.2023 :   దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మైలవరం పట్టణంలో కెడిసిసిబి బ్యాంకు వద్ద శ్రీ దుర్గా మోటార్ మెకానికల్ వర్కర్స్ అసోసియేషన్ పూజలందుకుంటున్న అమ్మవారు నేడు మంగళవారం అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.

మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అసోసియేషన్ ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్