డి.శ్రీనివాస్ మరణం చాలా బాధాకరం : పవన్ కళ్యాణ్
మనభారత్ న్యూస్, 29 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, మంగళగిరి :- మాజీ మంత్రి డి.శ్రీనివాస్ మరణం చాలా బాధాకరం. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న డి.శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, ఉన్నత విద్య శాఖల మంత్రిగా సేవలందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బలంగా తన వాదం వినిపించారు. వారిని రెండు మూడు సందర్భాల్లో కలిశాను. నా రాజకీయ ప్రయాణం, అభివృద్ధి గురించి అడిగి.. జనసేన పార్టీ ఎదుగుదలను ఆకాంక్షించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సియం కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీనివాస్ కుమారుడు, లోక్ సభ సభ్యులు ధర్మపురి అరవింద్‌కి, ఇతర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు.
What's Your Reaction?