ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పై సస్పెన్షన్ వేటు

కొత్తగూడెం మేదర బస్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫణి భాస్కర్ పై సస్పెన్షన్ వేటు

Nov 17, 2024 - 16:21
 0
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పై సస్పెన్షన్  వేటు

మనభారత్ న్యూస్ ప్రతినిధి, 17 నవంబరు 2024,  కొత్తగూడెం, తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుటుంబ సర్వే విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.కొత్తగూడెం మేదర్ బస్తీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫణి భాస్కర్ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండడం,సర్వేకి హాజరు కావడం లేదని ఉన్నతాధికారులకు కనీస సమాచారం ఇవ్వడం లేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దృష్టికి వెళ్లింది.దీంతో పాటు పాఠశాల విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా ఉంటూ, రికార్డుల సమర్పణలో అలసత్వం వహిస్తున్నాడని, పై అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్న మేదర్ బస్తీ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఫణి భాస్కర్ పై జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వర చారి సస్పెన్షన్ వేటు వేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News