జగ్గయ్యపేట లో ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
AITUC Jaggayyapeta
మనభారత్ న్యూస్, జగ్గయ్యపేట, ఆంధ్ర ప్రదేశ్, 01/11/2024 : జగ్గయ్యపేట పట్టణం,ఆర్.టి.సి డిపో వద్ద ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి.ఈ వేడుకలలో భాగంగా ఏఐటియుసి జెండాని బిల్డింగ్ వర్క్స్ యూనియన్ అధ్యక్షులు నీలకంఠ శివ ప్రసాద్ ఎగురవేయడం జరిగింది.అనంతరం ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి,కార్మికులకు ఏఐటియుసి జెండా అండగ ఉంటుందని నినదించారు.ఈ సందర్భంగా ఏఐటియుసి గౌరవాధ్యక్షులు జూనెబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ 1920 సంవత్సరంలో కార్మికుల హక్కుల కోసం పోరాడటం కోసం ఏఐటియుసి జెండా ఏర్పడిందని,ఎన్నో పోరాటాలతో కార్మికుల హక్కులను సాదించిందని తెలియజేశారు.సిపిఐ జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శి అంబోజి శివాజీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని,ఈ తరుణంలో కార్మికులందరు రాజకీయాలకు అతీతంగా మరింత ఐక్యతను పెంపొందించుకొని, కార్మికుల హక్కుల కోసం ఐక్య పోరాటాలతోనే సాధించుకోవడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వర్లు,షేక్ మహమ్మద్ అసదుల్లా,సిహెచ్ మల్లయ్య,మెటికల శ్రీనివాసరావు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.
What's Your Reaction?