'నా పేరు ద్వారకా ప్రభాకర్.. ఎల్టీటీఈ ప్రభాకరన్ కూతుర్ని'.. వీడియో వైరల్..

Nov 29, 2023 - 20:13
 0  100
'నా పేరు ద్వారకా ప్రభాకర్.. ఎల్టీటీఈ ప్రభాకరన్ కూతుర్ని'.. వీడియో వైరల్..

మనభారత్ న్యూస్, 29 నవంబరు 2023 :- లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించి చాలా ఏళ్లు గడుస్తున్నా.. ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ఇటీవల తమిళ నేత వైకో ప్రభాకరన్ జయంతి సభలో మాట్లాడుతూ.. ఇంకా టైగర్ ప్రభాకరన్ బతికే ఉన్నాడని, త్వరలో బయటకు వస్తారని కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ యువతి తాను ప్రభాకరన్ కూతురిని అని చెప్పుకునే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎల్టీటీఈ ప్రభాకరన్ కుమర్తెను అని చెప్పుకుంటున్న మహిళ వీడియో '' మవీరర్ నాల్'' సందర్భంగా కనిపించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును ఎల్టీటీఈ కార్యకర్తలు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ సంస్మరణ దినోత్సవంగా చేసుకుంటారు. తనను తానున ప్రభాకరన్ కుమార్తె, ద్వారకా ప్రభాకరన్‌గా మహిళ చెప్పుకుంది.

'' ఎన్నో కష్టాలు, ద్రోహాలను అధిగమించి ఇక్కడికి వచ్చాను. ఏదో ఒక రోజు ఈలంని కూడా సందర్శించి ప్రజలకు సేవ చేయాలని ఆశిస్తున్నాను'' అని మహిళ చెప్పడం వీడియో వినవచ్చు. శ్రీలంక సైన్యం చేతిలో ముల్లివైక్కల్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో ప్రభాకరన్ 14 ఏళ్ల క్రితం చనిపోయారు. ఆయన మృతదేహానికి డీఎన్ఏ పరీక్ష చేసి శ్రీలంక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

ద్వారకా ప్రభాకరన్, శ్రీలంక తమిళ భాషలో 12 నిమిషాల నిడివి కలిగిన వీడియోలో మాట్లాడారు. ప్రత్యక్షంగా ఎల్టీటీఈని ఎదుర్కోలేక శ్రీలంక ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల మద్దతు కోరిందని ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసం భిన్నత్వంలో ఏకత్వాన్ని నొక్కి చెబుతూ స్వేచ్ఛ కోసం ఎల్టీటీఈ పోరాటం కొనసాగుతుందని ఆమె అన్నారు.

విదేశాల్లో ఉన్న లంకేయులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, శ్రీలంకలో అట్టడుగున ఉన్న తమిళుల పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. ప్రత్యేక తమిళ ఈలం స్వయంప్రతిపత్తి, అభివృద్ధిని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఇది జాతీయ నాయకుడి ఆలోచన అని మహిళ పేర్కొంది.

తమిళ పోరాటం సింహళ ప్రజలకు వ్యతిరేకం కాదని.. తమపై అణిచివేతకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు. సింహళీయులు తమ అభిప్రాయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ద్వారకా ప్రభాకరన్ అని చెప్పుకునే వీడియోను రూపొందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించాలని సూచించే సమాచారం తమకు అందిందని శ్రీలంక ప్రభుత్వానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్