ముంచుకొస్తున్న మరో ప్రాణాంతక వైరస్.. కోవిడ్ కంటే ప్రమాదకరమా?
కోవిడ్ కంటే 20 రెట్లు ప్రమాదకరమైందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు
కోవిడ్ (covid) యావత్ ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేసిందో చూసాం. ఇప్పుడిప్పుడే దాని నుంచి ఆర్ధిక వ్యవస్థలు కూడా కోలుకుంటున్నాయి. ఇప్పుడు మరో ప్రాణాంతకమైన వ్యాధి ప్రపంచంపై దాడి చేయబోతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది.
ఈ వ్యాధి పేరు X. ఇదొక జూనాటిక్ వైరస్. జూనాటిక్ అంటే జంతువుల నుంచి మనుషులకు లేదా మనుషుల నుంచి జంతువులకు వ్యాపించేది అని అర్థం. ఈ X అనే తర్వాత రాబోయే ప్యాండెమిక్ వైరస్ మాత్రం కోవిడ్ కంటే 20 రెట్లు ప్రమాదకరమైందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
దాదాపు 5 కోట్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని చెప్తున్నారు. ఈ X వ్యాధి గురించి లండన్‌కు చెందిన ఎయిర్‌ఫినిటీ అనే సంస్థ బయటపెట్టింది. ఇది కోవిడ్ కంటే ఎక్కువ ప్రమాదకరం అని చెప్పడానికి 27.5 శాతం అవకాశం ఉందని అంటున్నారు. కాకపోతే ఈ వైరస్ 2033లో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇప్పటికైతే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అలాగని శాస్త్రవేత్తలు కూడా దీనిని తేలికగా తీసుకోవడం లేదు. అసలు ఏ వైరస్ వస్తుందో ముందే కనిపెట్టి నివారించే పనిలో పడ్డారు. ఒకవేళ ఈ X వ్యాధిని ఇప్పటినుంచే అడ్డుకట్ట వేయకపోతే 2033లో కేవలం లండన్‌లోనే ఒక్కో రోజు 15000 మందిని బలితీసుకునే అవకాశం ఉంది. ఈ X అనేది ఊపిరితిత్తుల్లో వచ్చే వైరస్. ఇలా ఊపిరితిత్తుల్లో మాత్రమే వచ్చే వైరస్‌లు అంత త్వరగా పోవు. అందుకే వైద్యులు, శాస్త్రవేత్తలు ఇప్పటినుంచే రీసెర్చ్‌లు మొదలుపెట్టేసారు.
What's Your Reaction?