అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

May 10, 2023 - 06:29
 0
అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

మనభారత్ న్యూస్, 10 మే 2023 : ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ గురించి ఈ మధ్య చర్చనీయాంశం అవుతోంది. యంత్రాలు యంత్రాలతో మాట్లాడి.. మానవ మేధస్సును దాంట్లో నిక్షిప్తం చేస్తారు.

ఒక్క మనిషి కాదు.. 1000 మంది మనుషుల మేధస్సులను అందులో పెట్టడం వల్ల అది దాదాపు అచ్చం వెయ్యి మంది ఎలాగైతే ప్రవర్తిస్తారో.. ఏ విధంగా మాట్లాడతారో.. ఏ విధంగా పాట పాడతారో.. ఆలోచిస్తారో అలానే అచ్చు గుద్దినట్లు చేస్తుంది.

ఒక రచయితలా.. డైరెక్టర్ లా ఎన్నో రకాల ఆలోచనలు యంత్రానికి వస్తాయి. మన మాటల్ని యథాతధంగా వినిపిస్తుంది. మనం మాట్లాడకుండానే మనం మాట్లాడినట్లు కూడా చేసి చూపిస్తోంది. అర్జంటుగా ఈ ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ అనే దాన్ని ఆపేయండని చాలా మంది మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మేధావులు, ప్రపంచ ఆర్థిక రంగ నిపుణులు దీనిపై తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఎలాన్ మస్క్ లాంటి వ్యాపారస్థుడు దీన్ని ఆపాలని కోరుతున్నారంటే ఎంతటి ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. 

దీనికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకోవాలని సూచించారు. మొదటి సారి అమెరికా స్పందించింది. టూల్స్ ఫర్ ఇమేజేస్ ఉండాలని సూచించింది. ఇది తేడాగా వ్యవహరిస్తుందని చెప్పింది. దీంతో ఒక సమావేశం నిర్వహించారు. ఇందులో మైక్రోసాప్ట్ తో పాటు వివిధ సంస్థల ప్రతినిధులు సమావేశానికి అటెండ్ అయ్యారు. ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థ కు సంబంధించి నిబంధలనపై చర్చ ప్రారంభించారు. 

ప్రస్తుతం 100 మిలియన్ కస్టమర్లతో ఉన్న ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ తో ఎంత ప్రయోజనం ఉందో.. అంతకంటే ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించి తయారీ సంస్థలు అదుపులో ఉంచకపోతే తీవ్ర ప్రమాదం తలెత్తుతుందని చెబుతున్నారు. రోబో సినిమా తరహాలో మనిషి అధీనంలో లేని ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ తో ప్రమాదం తప్పనిసరి.. రోబో గానీ ఇలాంటి నూతన టెక్నాలజీ కానీ మనిషి అధీనంలో ఉన్నంత వరకే దాని ప్రయోజనం పొందగలం.. లేకపోతే అది సృష్టించే విధ్వంసానికి గురి కావాల్సిందే..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News