షుగర్ ఉందని టెన్షన్ వద్దు.. ప్రకృతి వైద్యంతో ఇక చెక్

May 5, 2023 - 22:38
 0  302
షుగర్ ఉందని టెన్షన్ వద్దు.. ప్రకృతి వైద్యంతో ఇక చెక్

మనభారత్ న్యూస్, 05మే2023, ఆంధ్రప్రదేశ్ :- మన చుట్టూ ఉండే ప్రకృతి ఎన్నో ఔషధాలకు నిలయం.. మన పూర్వీకులు నాటు వైద్యం, మొక్కల నుంచి వచ్చే పసరు వంటి వాటినే వివిధ అనారోగ్య సమస్యలకు (Health Problems) మంచి ఔషధంగా వినియోగించేవారు.

కానీ ప్రస్తుతం ఇంగ్లీషు మందులు అధికమవడంతో... ప్రకృతి వైద్యం లేదా.. ఆయుర్వేదం (Ayuravedam) వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదు. వాస్తవానికి ఇంగ్లీషు మందులతో మనకు ఎన్నో సైడ్‌ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే ఆయుర్వేదిక్‌ మందులు, ప్రకృతి నుంచి తయారు చేసిన మందులను వినియోగించడం వల్ల ఎలాంటి ప్రభావం శరీరంపై పడదు. ఈ నేపథ్యంలోనే షుగర్‌తో బాధపడే రోగుల కోసం.. బాపట్ల జిల్లా (Bapatla Distirct) కేంద్రంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ జి. కె మూర్తి (Principal G.k.Murthy ) ఓ అద్భుతమైన ఔషధాన్ని కనుగొన్నారు. ఈ మందు వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని ఆయన అంటున్నారు. మరి ఆ విశేషాలు ఎంటో ఇప్పుడు చూద్దాం.. 

బాపట్లలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్‌ మూర్తికి ఎప్పటి నుంచో ప్రకృతిలో లభించే మొక్కలను సేకరించి వాటి నుంచి మంచి మందులను తయారు చేయాలని ఓ కల ఉండేది. ఈ క్రమంలోనే ఆయన ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం మన దేశంలో దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు షుగర్‌తో బాధపడుతున్న వారు ఉన్నారని అంచనా.. దీంతో షుగర్‌ను నియంత్రించే మొక్కల గురించి అధ్యయనం చేయడం ఆయన ప్రారంభించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గ్రాస్‌ అని పిలిచే గడ్డిలో షుగర్‌ను నియంత్రించే సామర్థ్యం ఉందని తెలుసుకొని.. ఆ గడ్డిని సేకరించి ప్రయోగాలు ప్రారంభించారు. 

ఆస్ట్రేలియా గ్రాస్‌.. ప్రపంచంలోని ఆసియా, పసిఫిక్‌ ఖండాలలో మాత్రమే లభిస్తుందని ప్రిన్సిపాల్‌ మూర్తి చెబుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో అలాంటి గడ్డి లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ గడ్డిని సేకరించిన తర్వాత దీనిపై పలు మార్లు ప్రయోగాలు చేసినట్లు మూర్తి తెలిపారు. సాధారణంగా ప్రతి మొక్కలో ఉండే ఒక్కో భాగం ఒక్కో అనారోగ్య సమస్యకు పనిచేస్తుందని.. అదేవిధంగా గడ్డిలో కూడా ఏ భాగం మనకు పనికి వస్తుంది అన్న అంశాన్ని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆ గడ్డిని వివిధ రకాలు సాల్వెంట్ కలిపి.. షుగర్‌ను నియంత్రించే మూలకాన్ని బయటకు తీసినట్లు మూర్తి చెబుతున్నారు. 

మన దేశంలో ఎక్కువ మంది షుగర్‌ వ్యాధిగ్రస్తులు.. ఇన్సులిన్‌ తీసుకోవడం, ఇతర ఇంగ్లీష్‌ మందులు వాడుకోవడం వంటివి సహజంగా పాటిస్తున్న పద్ధతులు. కానీ మొక్కల నుంచి లభించే మూలకాలతో చేసిన మందులను వినియోగిస్తే.. వెంటనే సత్ఫలితాలు ఇస్తాయని.. ఎలాంటి మందులను కూడా కూడా దీర్ఘకాలం వేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అంటున్నారు. మందులతోపాటు.. సరైన ఆహార నియమాలు పాటిస్తూ.. జీవన శైలి మార్పులు, రోజూ వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల షుగర్‌ను పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చని ప్రిన్సిపాల్‌ మూర్తి పేర్కొంటున్నారు. 

ప్రతి మొక్కకు ఒక ఔషధ గుణం ఉంటుంది. ఆకులో ఒక గుణాలు, పువ్వు, కాయ, స్టెమ్ వంటి వాటిల్లో మరో రకమైన గుణాలు ఉంటాయి. వివిధ సాల్వెంట్‌లను తీసుకుని వాటిపై ప్రయోగించి.. మనం మంచి ఔషధాలు తయారు చేయవచ్చని ప్రిన్సిపల్‌ మూర్తి చెబుతున్నారు. భారతదేశంలో చాలా రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని.. కానీ.. సైంటిఫికేషన్‌ లేదన్నారు. అయినప్పటికీ విస్తృతంగా ఇప్పటికీ ప్రకృతి వైద్యానికి మంచి గుర్తింపు, పేరు ఉందని ఆయన అంటున్నారు. కేవలం ఒక్క డయాబెటిస్‌కి మాత్రమే కాకుండా.. హై బీపీ వంటి వాటిని అదుపుచేసే ఔషధాలపై కూడా ప్రయోగాలు చేస్తున్నట్లు వివరించారు. 

చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి తీసుకొచ్చిన గ్రాస్‌ నుంచి ఒక సాల్వెంట్‌ని ఆయన ఎక్ట్రాక్ట్‌ చేశారు. ఇలా పలుమార్లు వేర్వేరు సాల్వెంట్‌లను వినియోగించి... గడ్డిలో షుగర్‌ను నియంత్రించగల నారింజన్‌ పదార్థంను ఆయన కనుగొన్నారు. తర్వాత ఆ పదార్థాన్ని యాంటీ డయాబెటిక్‌ యాక్టివిటీ ఉందా లేదా అని పరిశీలించారు. ఇది చాలా ముఖ్యమని మూర్తి అంటున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయిన తర్వాత.. ముందు కుందేళ్లపై ఆ మందును ప్రయోగించినట్లు తెలిపారు. కొన్ని రోజుల వ్యవధిలోనే సత్ఫలితాలు వచ్చాయని.. దీంతో ఆ మందును స్టేబుల్‌ ఫాంలో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. త్వరలో లిక్విడ్‌, క్యాప్సుల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని అంటున్నారు. 

సాధారణంగా షుగర్‌ వ్యాధి రెండు రకాలుగా ఉంటుందని.. ఒక రకమైన వ్యాధి కొద్ది రోజుల తర్వాత తగ్గుతుందని.. కానీ రెండో రకమైన షుగర్ వ్యాధి నయం కాదని.. దానికి జీవిత కాలం మందులు వాడాలని వైద్యులు చెబుతుంటారు. కానీ.. మూర్తి తయారు చేస్తున్న మందును మాత్రం.. మంచి ఫలితాలను అందిచ్చాయని తెలిపారు ప్రకృతి అందించిన మొక్కలలో చాలా విధమైన ఔషధాలు కలిగి ఉంటాయని మూర్తి అంటున్నారు. షుగర్ వ్యాధి మీద కాకుండా బీపీ తదితర రోగాలకు కూడా మందులను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మొక్కలో వివిధ రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటాయని.. వాటిని గుర్తించడమే కొంత కష్టమైన పని అని అంటున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్