రాహుల్‌కి జైలు శిక్ష వేసిన జడ్జ్‌కి ప్రమోషన్, సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

68 మంది జడ్జ్‌ లకు ప్రమోషన్

May 5, 2023 - 22:29
 0
రాహుల్‌కి జైలు శిక్ష వేసిన జడ్జ్‌కి ప్రమోషన్, సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష వేసిన జడ్డ్కు పదోన్నతి ఇవ్వడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.

ఆయనతో పాటు మొత్తం 68 మంది జడ్జ్లకు పదోన్నతినిచ్చారు. వీరిలో రాహుల్కు శిక్ష విధించిన హరీష్ హస్ముఖ్బాయ్ వర్మ కూడా ఉన్నారు. 65% కోటా ఆధారంగా వారికి పదోన్నతినిచ్చినట్టు ఇప్పటికే కోర్టు వెల్లడించింది. ఈ ప్రమోషన్స్పై సీనియర్ సివిల్ జడ్జ్ రవికుమార్ మెహతా, సచిన్ ప్రతాపరాయ మెహతా అసహనం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ప్రమోషన్ లిస్ట్ని క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ, మెరిట్ ఆధారంగా కొత్త లిస్ట్ని తయారు చేయాలని పిటిషన్లో ప్రస్తావించారు. సూరత్లోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో రాహుల్ గాంధీ పరువు నష్టం దావా కేసు విచారణ జరిగింది. మోదీ ఇంటి పేరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఓ బీజేపీ నేత పిటిషన్తో ఇది వెలుగులోకి వచ్చింది. 2019లో ఈ కామెంట్స్ చేయగా...ఇటీవల ఆయనకు రెండేళ్ల జైలు శిక్షవిధిస్తూ సూరత్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణ జరిపింది హరీష్ హస్ముఖ్ బాయ్ వర్మ. అయితే...ఇప్పుడు ఆయనకు సూరత్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టుకి చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్గా ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ నెల 8వ తేదీన ఈ పిటిషన్పై విచారణ జరగనుంది. 

రాహుల్కి షాక్..

పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన 2 ఏళ్లు జైలు శిక్ష పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. రాహుల్ పిటిషన్పై గుజరాత్ హైకోర్టులో వాదనలు జరిగాయి. కేసుకు సంబంధించిన రికార్డులు, న్యాయవిచారణ క్రమాన్ని తమకు సమర్పించాలని సూరత్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ ఆదేశించారు. అదే సమయంలో వేసవి సెలవుల తర్వాతనే తాను ఈ అంశంపై తీర్పు ఇస్తానని.. స్పష్టం చేశారు. రాహుల్కు రిలీఫ్ ఇచ్చేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.

రాహుల్ గాంధీ ప్రజాప్రతినిధి అని, ఆయన ఏదైనా ప్రకటనలు చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా నిర్దిష్ట పరిమితులు లోబడి వ్యహరించాల్సి ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ అన్నారు. రాహుల్ తరఫున అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించారు. తన క్లయింట్ హత్య వంటి ఎలాంటి ఘోర నేరానికి పాల్పడలేదని, ఎలాంటి నైతిక ప్రమాణాలను అతిక్రమించ లేదని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలు చేసిన ప్రాంతంలో పూర్ణేష్ మోదీ పిటిషన్ వేసి ఉండవచ్చని, అలా చేయకపోవడాన్ని కూడా అనుమానించాల్సి వస్తోందని సింఘ్వి వాదించారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్