6 నెలల లో టోల్ ప్లాజాలు తీసేస్తాం
కేంద్ర మంత్రి గడ్కరీ
మనభారత్ న్యూస్, 25 మార్చి 2023, ఢిల్లీ : దేశంలో ప్రస్తుతం ఉన్న హైవే టోల్ ప్లాజాల స్థానంలో వచ్చే 6 నెలల లో GPRS ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ ను ప్రవేశ పెడతామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలియచేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, హైవే పై ప్రయాణించే ఖచ్చితమైన దూరానికి డ్రైవర్ల నుండి టోల్ వసూలు చేయడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
టోల్ ఆదాయం ప్రస్తుతం రూ.40,000 కోట్లు గా ఉన్నదని, రెండు, మూడు సంవత్సరాలలో అది రూ.1.40 లక్షల కోట్లకు చేరుకోవచ్చని తెలియచేశారు.
What's Your Reaction?