కర్ణాటకలో కాంగ్రెస్ కు జై కొట్టిన ఎగ్జిట్ పోల్స్

May 6, 2023 - 12:33
 0
కర్ణాటకలో కాంగ్రెస్ కు జై కొట్టిన ఎగ్జిట్ పోల్స్

మనభారత్ న్యూస్, 06 మే 2023, కర్ణాటక : కర్ణాటకలో ఎన్నికలకు కేవలం మిగిలింది నాలుగు రోజులు మాత్రమే. ఈ నెల 10 వ తేదీన రాష్ట్రంలో పోలింగ్‌ జరగనుంది. అయితే ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం కనిపిస్తోందని కనీసం మూడు ఒపియన్‌ పోల్‌ సర్వేలు వెల్లడించాయి. ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఒపినీయన్‌ పోల్స్‌ తేల్చేశాయి.

అయితే జీ న్యూస్‌ మెట్రిజ్ నిర్వహించిన ప్రీ పోల్‌ సర్వేలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించబోతోందని వెల్లడించగా.. ఏబీపీ- సీ ఓటర్‌ ఒపీనియన్‌ పోల్స్‌ విషయానికి వస్తే కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తేల్చి చెప్పింది. బీజేపీ భారీగా సీట్లను కోల్పోతుందని.. అదే విధంగా జనతాదళ్‌ సెక్యూలర్‌ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని అంచనా వేసింది.

ఏబీపీ- సీవోటర్‌ నిర్వహించిన ఒపినీయన్‌ పోల్స్‌లో కర్ణాటకలో 224 సీట్లకు గాను కాంగ్రెస్‌ పార్టీ 107 నుంచి 119 సీట్లు గెలుస్తుందని, బీజేపీ 74 సీట్ల నుంచి 86 సీట్లు, జెడీఎస్‌ విషయానికి వస్తే 23 నుంచి 35 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. ఇక ఓట్ల షేరింగ్‌లో అధికార బీజేపీ పార్టీ కాంగ్రెస్‌ కంటే ఐదు శాతం వెనుకబడుతుందని తేల్చి చెప్పింది. ఇక ఓట్‌ షేరింగ్‌ విషయానికి వస్తే కాంగ్రెస్‌ 40 శాతం, బీజేపీ 35 శాతం, జెడీఎస్‌ 17 శాతం సాధించవచ్చునని వెల్లడించింది. ఇక ఇండియా టుడే - సీ ఓటర్‌ కూడా కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీ చేతిలో బీజేపీ చావుదెబ్బ తింటుదని తేల్చి చెప్పింది. బీజేపీ 74 నుంచి 86 సీట్లు సాధించవచ్చునని 2018తో పోల్చుకుంటే 24 సీట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని తేల్చి చెప్పింది. ఇక ఇండియా టుడే- సీ ఓటర్‌ ఓట్‌ షేరింగ్‌ విషయానికి వస్తే కాంగ్రెస్‌కు 107 నుంచి 119 వరకు, బీజేపీకి 74 సీట్ల నుంచి 86 సీట్ల వరకు .. జెడీ ఎస్‌ విషయానికి వస్తే 23 సీట్ల నుంచి 35 సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది.

జీ న్యూస్‌- మాట్రిజ్‌ సోమవారం నాడు విడుదల చేసిన ఒపినీయన్‌ పోల్స్‌లో మాత్రం బీజేపీ అతి పెద్ద రాజకీయపార్టీగా అవతరిస్తుందని.. తర్వాత స్థానం కాంగ్రెస్‌, మూడో స్థానంలో జెడి ఎస్‌ అని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విస్తృతంగా పర్యటించడంతో బీజేపీకి అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపింది. అదే సమయంలో రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్‌కు స్వల్పంగా లబ్ది జరిగే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. అయితే జీ న్యూస్‌ తమ శాంపిల్‌ సైజు అతి పెద్ద దని సుమారు 1.20 లక్షల మంది పురుషులు, 1.12 లక్షల మంది మహిళలను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పలకరించింది..ఈ ఒపీనియన్‌ పోల్స్‌ మార్చి 29 నుంచి 30వ తేదీన నిర్వహించినట్లు పేర్కొంది.

ఇక కన్నడ న్యూస్‌ చానల్‌ సువర్ణ న్యూస్‌ 24*7 జన్‌ కి బాత్‌లు రెండవ, తుది ప్రీపోల్‌ సర్వే నిర్వహించాయి. సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా బీజేపీ అవతరిస్తుందని అంచనా వేసింది. అయితే ఓట్‌ షేరింగ్‌లో మాత్రం బీజేపీ కంటే కాంగ్రెస్‌ స్వల్పంగా ముందంజలో ఉందని తెలిపింది. కర్నాటకకే చెందిన ఈదిన నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని కాంగ్రెస్‌కు 32-140 సీట్ల మెజారిటీ లభించే అవకాశం ఉందని, బీజేపీ విషయానికి వస్తే 57 నుంచి 65 సీట్లు.. ఓట్‌ షేరింగ్‌ విషయానికి వస్తే 33 శాతం సాధిస్తుందని తెలిపింది.

ఇదిలా ఉండగా బీజేపీకి చెందిన బీఎల్‌ సంతోష్‌ మాత్రం ఈ సర్వేలన్నీ అవాస్తవాలు, బోగస్‌ అని తేల్చేశారు. యోగేంద్ర యాదవ్‌ లాంటి వ్యక్తి తమ యజమానుల ప్రసన్నం చేయడానికి ఇలాంటి సర్వేలను నిర్వహించారని మండిపడ్డారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News