భారతీయులు ఎక్కువగా ఆన్‌లైన్ న్యూస్ చూస్తున్నారు... తాజా సర్వే చెబుతోంది ఇదే
మనభారత్ న్యూస్, 06 మే 2023, అంధ్రప్రదేశ్ : ప్రింట్ మీడియాకు రోజురోజుకీ ఇక్కడ ఆదరణ తగ్గుతుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. తాజా సర్వేలు కూడా అదే చెబుతున్నాయి. ఆన్లైన్ మీడియాకే ఆదరణ పెరుగుతోందని.
కాంటార్-గూగుల్ నివేదిక ప్రకారం చూసుకుంటే భారతీయుల్లో సగటు నలుగురిలో ముగ్గురు ఆన్లైన్ న్యూస్( Online News ) చదవడానికే మొగ్గు చూపుతున్నారట. భారతీయ భాషలకు సంబంధించి 52 శాతం మంది వివిధ న్యూస్ యాప్/వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో వార్తలను చదువుతున్నారని తెలుస్తోంది.
ఈ మేరకు 14 రాష్ట్రాల్లో 8 భాషలకు సంబంధించి 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న డిజిటల్ న్యూస్ వినియోగదారుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భారతదేశంలోని ఇంటర్నెట్ వినియోగం విరివిగా పెరిగిపోతున్న తరుణంలో సగానికి పైగా ఆన్లైన్ లోనే వార్తలు చదువుతున్నారు. ఇందులో సగం మంది ఆన్లైన్ వార్తలనే నిజమైనవిగా విశ్వసిస్తున్నారని కూడా కాంటార్-గూగుల్ నివేదిక నివేదించడం కొసమెరుపు. పట్టణ కేంద్రాల్లోని 37 శాతం ఇంటర్నెట్ వినియోగదారులతో పోలిస్తే, గ్రామీణ భారతదేశంలోనే ఆన్లైన్ వార్తలపై ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏమంటే, సాంప్రదాయ టీవీ ఛానెల్ల కంటే కూడా ఆన్లైన్ కే ఎక్కువ ఆదరణ లభిస్తోందని 48 శాతం మంది చెప్పడం జరిగింది. ఆన్లైన్ న్యూస్ కు సంబంధించి బెంగాలీ తమిళం కంటెంట్ ను ఎక్కువ మంది చదువుతున్నారు. తరువాత తెలుగు (79 శాతం) హిందీ (75 శాతం) గుజరాతీ (72 శాతం) మలయాళం (70 శాతం) మరాఠీ కన్నడం 66 శాతం చొప్పున ఉన్నాయి. ఈ భాషల్లో వీడియోలకు అత్యధిక డిమాండ్ ఉందని సర్వే ద్వారా తెలుస్తోంది.
What's Your Reaction?