మధిర టీబీ యూనిట్ సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని
మధిర-టీబీ-యూనిట్-సందర్శించిన-జిల్లా-వైద్య-ఆరోగ్యశాఖ-అధికారిని
మనభారత్ న్యూస్ ప్రతినిధి, 17 నవంబరు 2024, హయత్ నగర్,హైదరాబాద్, తెలంగాణ : మధిర టీబీ యూనిట్ సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కళావతి బాయ్ గారు. మధిర టిబి యూనిట్ నందు ప్రజలకు అందుతున్న సేవలను సేవల గురించి మరియు పరీక్షలు మందులు అందే విధానాన్ని పర్యవేక్షించారు 2025 టీబీ వ్యాధిని నియంత్రించాలని, ఖమ్మం జిల్లా టీబీ వ్యాధి నియంత్రణలో ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు మరియు సేవావికాసం స్వచందా సంస్థ అసోసియేషన్ వారు పి పార్థసారథి ,గీతా గారు స్వచ్ఛంద సేవ తరఫున అందించిన దుప్పట్లను టీబీ వ్యాధిగ్రస్తులకు డిఎంహెచ్వో గారి చేతుల మీదుగా అందజేశారు.మందులు సకాలంలో వాడాలని బలమైన ఆహారం తీసుకోవాలని రోగులకు సూచించారు. సివిల్ హాస్పిటల్ కి విచ్చేసిన సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది డిఎంహెచ్వో గారిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మధిర సివిల్ హాస్పిటల్ సూపర్డెంట్ కే అనిల్ కుమార్ గారు, డాక్టర్ పృథ్వి నాయక్ గారు సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ సందీప్ హెల్త్ సూపర్వైజర్ కొండయ్య సిహెచ్ఓ వెంకటేశ్వర్లు హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఫార్మసిస్ట్ ఫైమున్, రేడియోగ్రాఫర్ సుదర్శన్ మధిర సివిల్ హాస్పిటల్ హెడ్ నర్స్, స్టాఫ్ నర్స్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు
What's Your Reaction?