అయోధ్య లో అత్యంత వైభవంగా బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ

Jan 22, 2024 - 14:58
Jan 22, 2024 - 15:00
 0
అయోధ్య లో అత్యంత వైభవంగా బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ
అయోధ్య లో అత్యంత వైభవంగా బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ
అయోధ్య లో అత్యంత వైభవంగా బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ
22 జనవరి 2024, అయోధ్య, భారతదేశం (మనభారత్ న్యూస్ ప్రతినిధి) :  అయోధ్య ఆలయంలో బాల రాముడి విగ్రహాన్ని అత్యంత వైభవంగా ప్రతిష్ఠించారు. అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ మహా ఘట్టాన్ని వేద పండితుల ద్వారా అత్యంత వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమాన్ని కుల మతాలకు అతీతంగా ప్రపంచం లోని అన్ని దేశాలనుండి ప్రజలు అత్యంత ఆసక్తితో వీక్షించారు. హిందూ ధార్మిక సంస్థలు ఈ కార్యక్రమాన్ని భారతదేశ భవిష్యత్తును మలుపుతిప్పే అద్భుత ఘట్టంగా అభివర్ణించడం భారత ప్రజలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పుకోవాలి. 
 
22 జనవరి రోజు సరిగ్గా మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమైన ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఒంటిగంట వరకు కొనసాగింది. అంనతరం మధ్యాహ్నం 1:15 గంటలకు ప్రధాని భారత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మహత్తర కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు, క్రీడారంగానికి సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రధాని చేతులమీదుగా నిర్వహించగా .. మోడీ తో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ధార్మిక గురువులు మరియు అన్ని రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

ఇక్కడ ప్రాణ ప్రతిష్ట జరగడానికి కొన్ని గంటల ముందు మెక్సికోలోనూ రాముడికి ప్రాణ ప్రతిష్ట జరిగినట్లు తెలియవచ్చింది.  ఉత్తర అమెరికాకు చెందిన మెక్సికో దేశంలోని క్యురెటరో నగరంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. మెక్సికోలో తొలి రామ మందిరాన్ని ప్రారంభించారు. ఒకే రోజు ఈ రెండు కార్యక్రమాలు జరగడంతో ప్రపంచవ్యాప్తంగా రామ నామ స్మరణలు మార్మోగాయి. 
 
క్యురెటరో నగరంలోని ఆలయంలో భారత సంతతి మంత్రాల ఉచ్ఛారణ, రామ నామ స్మరణలతో నిండిపోయింది. భారత సంస్కృతి ఉన్నతి ఎల్లలు దాటిన ఘట్టానికి ఉదాహరణగా నిలిచింది. అమెరికా పురోహితుడు మంత్రాలు చదువుతూ రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. మెక్సికన్లు ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతిష్టించడానికి రాముడి విగ్రహాన్ని ఇండియా నుంచే తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

మెక్సికోలోని భారత దౌత్య కార్యాలయం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మెక్సికోలో రామ మందిర ప్రారంభాన్ని వెల్లడించింది. 'అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న తరుణంలో మెక్సికోలో తొలి రామ మందిరం ప్రారంభమైంది. హనుమంతుడి తొలి ఆలయం ఉన్న నగరం కూడా క్యురిటెరోనే' అని వివరించింది. ఈ సందర్భంగా ఆలయం మొత్తం భారత సంతతి వారి పాటలు, శ్లోకాలతో నిండిపోయింది' అని,  ఇందుకు సంబంధించిన వీడియోలతో ఇండియన్ ఎంబసీ ఎక్స్‌లో పోస్టు చేసింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News