వాట్సాప్ నుంచి బిగ్ అప్‌డేట్.. పోల్స్ ఫీచర్, మీడియా షేరింగ్‌లో కొత్త ఆప్షన్‌లు ఇవే!
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లు వినియోగిస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్(WhatsAPP). ఈ యాప్ లేని స్మార్ట్‌ఫోన్ ఉండదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
అంతగా వినియోగదారులకు చేరువైంది. ఇప్పటికీ యూజర్లకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే లక్ష్యంతో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ రిలీజ్ చేస్తోంది. తాజాగా వినియోగదారులను అభిప్రాయాలను అడగడానికి, ఫీడ్‌బ్యాక్ సేకరించడానికి తీసుకొచ్చిన పోలింగ్ ఫీచర్(Polling Feature)కి ఓ అప్‌డేట్ అందించింది. అదే విధంగా మెసేజ్‌లు, డాక్యుమెంట్లను క్యాప్షన్(Caption)తో ఫార్వాడ్ చేసే సదుపాయం తీసుకొచ్చింది. యూజర్లు సులువుగా ఇన్‌ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి, ఈజీగా కమ్యునికేట్ కావడానికి అందించిన లేటెస్ట్ ఫీచర్ అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
యూజర్లకు యాప్ వినియోగం ప్రొడక్టివ్, మరింత ఫన్‌గా ఉండేందుకు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. లేటెస్ట్ అప్‌డేట్‌లు యాప్‌ని ఉపయోగించే ప్రతి ఒక్కరికీ చాటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుస్తాయని కంపెనీ భావిస్తోంది. యూజర్లకు ఉత్తమ సేవలు అందించేందుకు నిరంతరం అభివృద్ధి చేస్తూనే ఉంటామని పేర్కొంది.
పోలింగ్ ఫీచర్ లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే
వాట్సాప్ 2022 నవంబర్‌లోనే పోలింగ్ ఫీచర్‌ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫీచర్‌కి లేటెస్ట్ అప్‌డేట్‌లను ఇంట్రడ్యూస్ చేసింది. ఈ అప్‌డేట్‌లలో సింగిల్-ఓట్(Single-Vote) పోల్స్ క్రియేట్ చేయడం, చాట్‌లలో పోల్స్ కోసం సెర్చ్ చేయడం, పోల్ రిజల్ట్స్ గురించి నోటిఫికేషన్‌లను స్వీకరించడం వంటివి ఉన్నాయి. సింగిల్-ఓట్ ఫీచర్‌తో యూజర్లు పోల్‌లో ఒకే ఓటు వేసేలా పరిమితం చేయవచ్చు. సెర్చ్ ఆప్షన్ ద్వారా పోల్స్ వారీగా మెసేజ్‌లను ఫిల్టర్ చేయవచ్చు. అలానే కొత్త నోటిఫికేషన్ ఫీచర్ ద్వారా వినియోగదారులకు పోలింగ్ యాక్టివిటీపై అప్‌డేట్‌గా ఉంటారు, ఎంత మంది ఓటు వేశారో చూడగలరు. ఈ అప్‌డేట్‌లతో పోల్స్ ద్వారా యూజర్లతో సులువుగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం లభిస్తుంది.
మీడియా ఫైల్స్ షేరింగ్‌కి కొత్త ఆప్షన్స్
యూజర్లు ఈజీగా ఇన్‌ఫర్మేషన్ షేర్ చేయడానికి, కమ్యూనికేట్ కావడానికి వీలుగా వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్ల(Documents)ను క్యాప్షన్‌లతో ఫార్వార్డ్ చేసే అవకాశం కల్పించింది. కాంటాక్ట్స్‌తో మీడియాను షేర్ చేసేటప్పుడు ఈ ఫీచర్ మరింత వివరణ అందిస్తుంది. వినియోగదారులు మీడియాను ఫార్వార్డ్ చేయడానికి ముందు క్యాప్షన్‌లను ఎడిట్ చేయవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు. అదనంగా వినియోగదారులు వీడియోలు, ఫోటోలను ఫార్వార్డ్ చేసే ముందు వాటికి క్యాప్షన్‌లు యాడ్ చేయవచ్చు. ఇలా తమ ఉద్దేశాలను యూజర్లు క్యాప్షన్ ద్వారా వివరించవచ్చు. ఈ లేటెస్ట్ అప్‌డేట్‌లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లకు దశలవారీగా వాట్సాప్ కంపెనీ అందుబాటులోకి తీసుకొస్తోంది. త్వరలోనే అందరి యూజర్లకు ఈ ఆప్షన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం వస్తుంది.
What's Your Reaction?