నిబంధనలు ఉల్లంఘిస్తే జూనియర్‌ కాలేజీలకు దిమ్మతిరిగే జరిమానాలు..

ఏపీ ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

May 5, 2023 - 17:44
May 5, 2023 - 17:45
 0
నిబంధనలు ఉల్లంఘిస్తే జూనియర్‌ కాలేజీలకు దిమ్మతిరిగే జరిమానాలు..

మనభారత్ న్యూస్, 05 మే 2023, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలకు ఇంటర్‌ విద్యామండలి గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఇకపై ఇష్టారీతిగా నిబంధనలు ఉల్లంఘించే ఇంటర్మీడియట్‌ ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు దిమ్మతిరిగే జరిమానాలు విధించనున్నట్లు బోర్డు ప్రకటించింది.

ఇప్పటి వరకున్న జరిమానాలను భారీగా పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. మండలం, పుర, నగరపాలికల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అనుమతి లేకుండా కళాశాలను మార్చితే విధించే జరిమానా రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షలకు పెంచింది. మండలం నుంచి మండలానికి, మండలం నుంచి పుర, నగరపాలక ప్రాంతానికి అనధికారికంగా మార్చితే విధించే జరిమానా రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

అలాగే అనుమతులు లేకుండా ఇతర సొసైటీలు, ట్రస్టులకు మార్పు చేసినా కూడా రూ.అయిదు లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మహిళా కళాశాలగా అనుమతి తీసుకొని, కో ఎడ్యుకేషన్‌ నిర్వహిస్తే రూ.రెండు లక్షల వరకు జరిమానా విధిస్తామని బోర్డు హెచ్చరించింది. ఈ మేరకు తెలియజేస్తూ రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కాలేజీలకు ఉత్తర్వులు జారీ చేసింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News