అమరావతి జేఏసీకి హైకోర్టు షాక్

దిమ్మతిరిగిపోయిందా ?

May 6, 2023 - 06:24
 0
అమరావతి జేఏసీకి హైకోర్టు షాక్

మనభారత్ న్యూస్, 06 మే 2023, అంధ్రప్రదేశ్ : ఓవర్ యాక్షన్ చేస్తు రెచ్చిపోతున్న అమరావతి జేఏసీకి హైకోర్టు పెద్ద షాకిచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాలు ఇవ్వచ్చని తీర్పుచెప్పింది.

ఇళ్ళపట్టాల పంపిణీపై అభ్యంతరాలు చెబుతు కేసు వేసే అధికారం అమరావతి జేఏసీకి లేదని కోర్టు తేల్చిచెప్పింది. ఇంతకుముందు ఇలాంటి తీర్పే సుప్రింకోర్టు కూడా ఇచ్చింది. పట్టాల పంపిణీపై అమరావతి జేఏసీ కేసును కొట్టేసిన సుప్రింకోర్టు అంతిమ నిర్ణయం హైకోర్టే తీసుకుంటుందని చెప్పింది.

ఇపుడా కేసునే హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తాజా తీర్పువల్ల ఆర్ 5-జోన్ ఏర్పాటుకు అడ్డంకులన్నీ క్లియర్ అయిపోయినట్లే. రాజధాని జిల్లాలైన గుంటూరు, ఎన్టీయార్ లో 1134 ఎకరాల్లో సుమారు 50వేలమంది పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీ చేయాలని జగన్ అనుకున్నారు. అయితే పేదలకు తమ భూముల్లో పట్టాలిస్తే భౌగోళిక సమతుల్యం దెబ్బతింటుందని రైతుల ముసుగులో టీడీపీ నేతలు కేసులు వేశారు. అయితే అనేక విచారణల తర్వాత చివరకు కేసును హైకోర్టు కొట్టేసింది.

భూములను రైతులు ప్రభుత్వానికి ఇచ్చేసిన తర్వాత ఇక ఆ భూములు ప్రభుత్వానివే అవుతాయని కోర్టు స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వానికి ఇచ్చేసిన భూములపై రైతుల పెత్తనం ఏమిటంటు కోర్టు మండిపడింది. ప్రభుత్వానికి భూములిచ్చిన తర్వాత పేదలకు పట్టాలు ఇవ్వకూడదని అభ్యంతరం చెప్పే అధికారం రైతులకు లేదన్నది. హోలు మొత్తం మీద అమరావతి జేఏసీకి రెండు కోర్టుల్లోను తలంటి తప్పలేదు. 

రైతులకు ఇచ్చిన భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నదా అని అడిగితే రైతులు తీసుకోవటంలేదన్నారు. మరి మిగులు భూమిలో ప్రభుత్వం పేదలకు పట్టాలిస్తుంటే మీ గోలేమిటని దుమ్ముదులిపేసింది. సీఆర్డీయే చట్టంలోనే మొత్తం భూమిలో పేదలకు 5 శాతం పట్టాలివ్వాలని ఉన్న విషయాన్ని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది. దాంతో అమరావతి జేఏసీ కేసును హైకోర్టు కొట్టేసింది. దాంతో ఈనెల 15వ తేదీకల్లా పేదలందరికీ పట్టాలివ్వటానికి ప్రభుత్వం రెడీ అయిపోతోంది. పై రెండు జిల్లాల్లోని సుమారు ఎనిమిది గ్రామాల్లోని పేదలకు పట్టాలు అందబోతున్నాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News