పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వాక్కు నిజమైందిగా

కలియుగం అంతమయ్యే టైం దగ్గర పడిందా..?

Oct 19, 2023 - 15:22
 0
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వాక్కు నిజమైందిగా

మనభారత్ న్యూస్, 19 అక్టోబరు 2023, ఆంధ్రప్రదేశ్ : ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో వింతలు, ఎన్నో అద్భుతాలు ఎదో ఒక మూలన చోటుచేసుకుంటూనే ఉంటాయి. సైన్స్‌ ఫాలో అయ్యే వాళ్లు వాటికి కారణాలు విశ్లేషిస్తే..

కొందరు మాత్రం ఆ ఘటనలను దేవుడు సృష్టించిన అద్భుతాలుగా నమ్ముతారు. ఇప్పుడు ఎందుకు ఈ అద్భుతాలు.. వింతల గురించి టాపిక్ ఏంటని అనుకుంటున్నారా.. ఎందుకంటే అలాంటి వింతే ఒకటి చోటుచేసుకుంది కాబట్టి. అయితే కొంతమంది దాన్ని జన్యుపరమైన లోపాలుగా పరిగణిస్తుంటే మరికొందరు పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టు జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా వింత వింతే. సహజంగా ఉండాల్సిన చోట, ఉండవలసిన పోలికలో ఉండకుండా వేరే పోలికలలో ఉంటే దాని వింత లేక అద్భుతమే అని అనక తప్పదు. ఇప్పుడు అలాంటి ఘటన గురించే మనం మాట్లాడుకుంటున్నాం.

ఓ చూలుతో ఉన్న గేదె వరాహ (పంది) రూపంలో ఉన్న వింత దూడకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. జీలుగుమిల్లి మండలం కామయ్యపాలానికి చెందిన రూప అంజిబాబు వ్యవసాయం చేస్తూ ఉంటారు. సహజంగా రైతు కావడంతో ఆయనకు పాలిచ్చే పాడి గేదలు ఉన్నాయి. అయితే ఆయన దగ్గర ఉన్న గేదెలలో ఒక గేద చూలు కట్టి నెలలు నిండడంతో దానికి ఓ దూడ జన్మించింది. అయితే ఆ దూడను చూసిన అంజిబాబు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే ఆ దూడ చూడడానికి అచ్చం వరాహ (పంది) రూపంలో ఉంది. దాని మెడ ,కాళ్లు , చెవులు, తోక వరాహానికి ఏ విధంగా ఐతే ఉంటాయో ఇంచుమించు పూర్తిగా అలాగే ఉన్నాయి. దీంతో తన గేదకు పుట్టిన వింత దూడ సమాచారాన్ని బంధువులకు స్థానికులకు తెలియజేశారు. వరాహ రూపంలో ఉన్న వింత దూడను చూసేందుకు స్థానికుల సైతం ఎక్కువగా ఆసక్తి చూపించారు.

అయితే ఆ వింత దూడ మాత్రం పుట్టిన వెంటనే చనిపోయింది. ఈ దూడ జననంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. పశు వైద్యులు మాత్రం జన్యుపరమైన లోపాల కారణంగానే ఈ విధంగా దూడ జన్మించిందని చెబుతుంటే మరికొందరు మాత్రం పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానంలో గేదెకు వరాహం పుడుతుందని రాసి ఉందని, ఆ ప్రకారంగానే ఇప్పుడు జరిగిందని అంటున్నారు. త్వరలో కలికాలం అంతం అవుతుందని చెబుతున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News