మనభారత్ న్యూస్, 21 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, జగ్గయ్యపేట :- జగ్గయ్యపేట వై.వై కాలనీలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్. మల్లేశ్వరరావు పారిశుద్ధ్య కార్యక్రమాలు గురువారం తనిఖీ చేయడం జరిగింది. సదరు పరిసరాలను శానిటరీ మేస్త్రీలు, హెల్త్ కార్యదర్శి, శానిటేషన్ కార్యదర్శి, ఆశా వర్కర్లతో పాల్గొన్నారు. సదరు ప్రాంతంలో పై సిబ్బందితో టీములుగా ఏర్పాటు చేసి వర్షాకాలం దృష్ట్యా అతిసారం మొదలగు వ్యాధుల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియచేయడమైనది.
డయేరియా ప్రభల కుండా తీసుకోవలసిన జాగ్రత్తలు
1. కాచి చల్లార్చిన నీటిని త్రాగవలెను
2. వంట పాత్రలను వేడి నీటితో శుబ్రపరుచుకొనవలెను.
3. ఆహారం తినే ముందు, తిన్న తరువాత చేతులు శుబ్రపరుచుకొనవలెను.
4. నిల్వ ఉన్న పాడైపోయిన ఆహార పదార్ధములు తినరాదు.
5. ఇంటి పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ లేకుండా చూసుకొనవలెను.
6. ఇంటి పరిసరాలను బ్లీచింగ్, ఫినాయిల్ మొదలగు వాటిని వినియోగించి పరిశుభ్రంగా ఉంచవలెను.
7. ఓవర్ హెడ్ ట్యాంక్ లు మూతలు లేకుండా ఉంచరాదు తరచు బ్లీచింగ్ తో శుబ్రపరచుకొనవలెను.
8. మరుగుదొడ్లు వినియోగించిన తరువాత సబ్బుతో చేతులు శుబ్రంచేసుకొనవలెను.
9. చిన్న పిల్లలను మురుగు నీటి నందు ఆడుకోకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను.
10. దోమలు కుట్టకుండా కాయిల్స్, దోమ తెరలు మొదలగునవి ఉపయోగించవలెను.
పై జాగ్రత్తల గురించి ప్రతి ఇంటిలోను తెలియపరచడమైనది.
కావున పై ఆరోగ్య సూత్రాలు ప్రతి ఒక్కరూ పాటించవలసినదిగా కోరడమైనది. పురపాలక సంఘం తరుపున మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించి ప్రజారోగ్య వర్కర్లచే శానిటేషన్ చేయించవలసినదిగా పారిశుద్ధ్య కార్యదర్శులకు తెలియపరచడమైనది. మురుగు తొలగించిన వెంటనే బ్లీచింగ్, లైమ్ వెంటనే చల్లించవలసినదిగా తెలియచేయడమైనది. జ్వరం / అతిసార పై చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో సర్వే చేయించగా జ్వరం/డయేరియా కేసులు ఏమి నమోదు కాలేదని తెలియపరచడమైనది.