యోగాతోనే ఆరోగ్యం
12వ-అదనపు-జిల్లా-జడ్జి-ఏ.వాసంతి
మనభారత్ న్యూస్, 21 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, పిఠాపురం :- యోగాతోనే ప్రతి మనిషి ఆరోగ్యం అంతగా ఉల్లాసంగా ఉంటారని 12వ అదనపు జిల్లా జడ్జి ఏ వాసంతి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా పిఠాపురం లైన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులుచే యోగా గురువు ఎన్వి రమణ పలు రకాల యోగ ఆసనాలు చేయించారు. అనంతరం 12 అదనపు జిల్లా జడ్జి ఏ.వాసంతి మాట్లాడుతూ మారుతున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరూ యోగ తప్పనిసరిగా చేయాలని తద్వారా ఆరోగ్యవంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితం కొనసాగుతుందని ఆమె అన్నారు. మనం ప్రతినిత్యం ఎన్నో ఒడిదుడుకుల మధ్య జీవిస్తున్నామని ఆ ఒడిదుడుకులు తగ్గాలంటే తప్పనిసరిగా యోగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రోజు ఉదయాన్నే ప్రతి ఒక్కరు యోగా చేయడం ద్వారా శారీరక రుగ్మతలు పోయి ప్రశాంత వాతావరణంలో ఆరోగ్యవంతంగా జీవిస్తామని ఆమె అన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ ఎం.బాబు, మెజిస్ట్రేట్ ఎం.విజయ రామేశ్వరి, బార్ అసోసియేషన్ సభ్యులు ఏ.కే.వై.రెడ్డి తదితర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?