పేదోళ్ళుకు పండుగ ! - ఒకటో తేదీన రూ. 4,000 పంపిణీకి ఏర్పాటు

Jun 29, 2024 - 23:40
Jul 1, 2024 - 14:59
 0
పేదోళ్ళుకు పండుగ ! - ఒకటో తేదీన రూ. 4,000 పంపిణీకి ఏర్పాటు

మనభారత్ న్యూస్, 29 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, అమలాపురం :- పేద వర్గాలు ఆశతో ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. వచ్చేనెల 1వ తేదీన ప్రతి పేదవాడికి రూ.7వేలు పింఛన్‌ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పింఛన్లకు సంబంధించిన ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాయి. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్య్రకార, చెప్పులు కుట్టే వృత్తి వారు, ట్రాన్స్‌జెండర్లు, ఏఆర్‌టీ, డప్పు కళాకారులు, ఆర్టిస్టు పెన్షన్‌ దారులకు పింఛన్లు పెంచారు. వారు పెన్షన్‌ రూ.3 వేలు నుంచి రూ.4 వేలకు పెరిగింది. అలాగే దివ్యాంగులు, కుష్టు రోగులకు అందించే పింఛన్లు రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. అంతేకాదు పూర్తి వైకల్యం ఉన్న వారికి రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పింఛన్‌ పెంచింది ప్రభుత్వం. ఇక తీవ్రమైన వ్యాధిగ్రస్తులు, గుండె, కిడ్నీ, లివర్‌ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు, డయాలసిస్‌ రోగులకు ఫించన్‌ను రూ.5 వేల నుంచి రూ.10వేలకు పెంచింది ప్రభుత్వం. ఏప్రిల్‌ 1 నుంచి పెంచిన పింఛన్లు అమల్లోకి వస్తున్నాయి. అంటే జూలై 1న ఒక్కో పింఛన్‌ దారుడు రూ.7వేలు పొందుతారు. ఆ తర్వాత ఆగస్టు నుంచి నెలకు రూ.4వేలు పింఛన్‌ అందుకుంటారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికెళ్లి పంపిణీ చేయనున్నారు. పింఛన్లు పంపిణీకి సంబంధించిన ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో సచివాలయ ఉద్యోగి కనీసం 50 మందికి పంపిణీ చేస్తారని ప్రభుత్వం తెలిపింది. జిల్లా కలెక్టర్లు, అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటి దగ్గరే పింఛన్లు అందజేయనున్నారు. ఇచ్చిన హామీల మేరకు పెంచిన ఫించన్‌ రూ.4వేలు, మూడు నెలలకు సంబంధించి రూ.1000 చొప్పున.. మొత్తం కలిపి రూ.7వేలు లబ్ధిదారులకు అందజేస్తారు. పింఛన్లు పంపిణీ బాధ్యతల్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. దీంతో వాలంటీర్ల దగ్గర ఉన్న ఫోన్లు, బయోమెట్రిక్‌ డివైజ్‌లు ఇప్పటికే సచివాలయ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ నెల 30వ తేదీ ఆదివారం కావడంతో.. ఈనెల 29వ తేదీలోనే సచివాలయ సిబ్బందికి పింఛన్‌కు సంబంధించిన డబ్బుల్ని అందజేశారు. అలాగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జూలై 1న మంత్రులు ఎమ్మెల్యేలు, నేతలు కూడా పాల్గొంటారు. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండగలా నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది. ఎవరు గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని.. ఇంటికి నేరుగా పింఛన్‌ తీసుకొచ్చి ఇస్తారన్నారు. మొత్తం మీద ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. పింఛన్ల ను పెంచి జూలై 1నుంచి లబ్ధిదారులకు అందజేయబోతోంది. అయినవిల్లి మండలంలోని 5,915 మంది పింఛన్‌ దారులు కోసం ప్రభుత్వం రూ.6 కోట్లు 25లక్షల 84వేలు మంజూరు చేసినట్లు ఎంపీడీఓ టీ.ఎస్‌.మూర్తి తెలిపారు. సాధారణంగా అయినవిల్లి మండలంలో సామాజిక పింఛన్లకు రూ.2కోట్లు 85లక్షల 87వేలు అవసరంపడేది. ఈ మేరకు అయినవిల్లి మండలంలో 5,915 మందికి ఆగస్టు నెల నుంచి రూ.3కోట్ల 40లక్షల 27వేలు అవసరం అవుతుందని తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

suneelkumaryandra My Name is Dr Suneelkumar Yandra, Journalist, Writer & Film Director.