ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ప్రమాణస్వీకారం-చేయించిన-ప్రొటెం-స్పీకర్-గోరంట్ల-బుచ్చయ్య-చౌదరి
మనభారత్ న్యూస్, 21 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, పిఠాపురం :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడిగా ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పవన్ కళ్యాణ్‌తో ప్రమాణం చేయించారు. సభ ప్రారంభం కాగానే స్పీకర్ సభ్యులందరికీ సభా సంప్రదాయాలు వివరించి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని స్పీకర్ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసేందుకు లేచి నిలబడగానే సభలో ఉన్న సభ్యులంతా గౌరవ సూచకంగా నిలబడి కరతాళధ్వనులతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయుడిగా ఉంటూ విధులు నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్‌కి ప్రొటెం స్పీకర్ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి పవన్ కళ్యాణ్‌తో రిజిస్టర్లో సంతకాలు స్వీకరించారు. సభలోకి అడుగుపెట్టగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేయించారు.
What's Your Reaction?