ఏరువాక పున్నమి రైతు సస్యవృద్ధి బీజారోపనోత్సవం
ఏరువాక-పున్నమి-రైతు-సస్యవృద్ధి-బీజారోపనోత్సవం
మనభారత్ న్యూస్, 21 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, పిఠాపురం :- శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా నేడు ఉదయం 9 గంటలకు రైతు సోదరులకు ఏరువాక పౌర్ణమి ఉత్సవం నిర్వహిస్తున్నారని పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తెలిపారు. జ్యేష్ట పూర్ణిమ నాడు చేసే ఈ రైతు ఉత్సవంలో రైతు తొలిసారిగా పొలం దున్నుతున్నాడని, గత ఐదు సంవత్సరాలుగా ప్రతీ ఏటా జేష్ట పూర్ణిమ రోజున శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో జరిగే రైతు సోదరుల ఉత్సవంలో సద్గురు దివ్య బీజములు, అధిక దిగుబడి నిచ్చే కూరగాయ విత్తనాలు పంచడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా రైతులకు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సును నిర్వహించడానికి ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్తలు అనుభవజ్ఞులైన రైతులచే శిక్షణా కార్యక్రమం కూడా నిర్వహించబడుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో నలుమూలల నుండి వందలాది మంది రైతులు వచ్చి పాల్గొనే ఈ ఉత్సవంలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా గురువర్యులు రైతు సోదరులకు సద్గురు దివ్యబీజములను ప్రసాదించి ఆశీస్సులు అందజేస్తారన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పీఠాధిపతుల తండ్రిగారైన పరబ్రహ్మ మొహియద్దీన్ బాద్షా గారి పేరున స్మారక రైతు పురస్కారాన్ని అందజేయడమే కాకుండా ఉత్తమ రైతులను సన్మానించి, రైతు సోదరులకు జ్ఞాపికలను అందజేస్తారన్నారు. రైతు సోదరులు అందరూ ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొన వలసినదిగా ఆధ్యాత్మిక పీఠం ఆహ్వానం పలుకుతుందని పీఠం కన్వీనర్ సూరిబాబు పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
What's Your Reaction?