ఉపవాసకులతో ఘనంగా అంగారక ‘చతుర్ధిఉత్సవం’

వేంకట-శ్రీకరం-సంకష్ట-హర-వ్రతం-:-కాకినాడభోగిగణపతిపీఠం

Jun 26, 2024 - 00:33
Jun 26, 2024 - 16:00
 0
ఉపవాసకులతో ఘనంగా అంగారక ‘చతుర్ధిఉత్సవం’
ఉపవాసకులతో ఘనంగా అంగారక ‘చతుర్ధిఉత్సవం’

మనభారత్ న్యూస్, 25 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్పిఠాపురం :- కలియుగ ప్రాపంచిక జీవనంలో ఆధ్యాత్మికతకు ఆటంకాలు తొలగించే సంకష్ట హర చతుర్ధి మాసోత్సవం కష్టాలు తొలగించే  వేంకటేశ్వర స్వామి నామశక్తిపాతాన్నందించే సర్వదేవతా వ్రతాల మణిహారమని భోగిగణపతి పీఠం పేర్కొంది. ఉత్తరాదిలో ఈ వ్రతాన్ని ఇంటింటా శక్త్యానుసారం అల్పాహార విందుతో అత్యంత ఘనంగా జరుపుకుంటారన్నారు. కృష్ణ పింగళ సంకష్టహర చతుర్ధి సందర్భంగా కాకినాడ సూర్యారావు పేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభు పీఠంలో 5వ చతుర్థి ఉత్సవాన్ని మంగళవారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించారు. సూర్యోదయ సుప్రభాత వేళలో చతుర్థి ఉపవాసకులు గణేశ ఉత్సవ విగ్రహాన్ని సన్నాయి మేళంతో పీఠం మాఢ వీధులందు (తూర్పు పడమర ఉత్తర దక్షిణ రహదారుల్లో) పెద్దఎత్తున పుష్పార్చనతో ఊరేగించి నగరసంకీర్తన సహస్ర నామపారాయణ నిర్వహించారు. చంద్రోదయ వేళలో లక్ష వత్తుల దీపారాధన మహాహారతి, పసుపు, కుంకుమ, రవిక, గాజుల ప్రదానంతో ఉపవాసకులకు అల్పాహార విందును ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ మంగళవారం చతుర్థి తిధి అంగారక చతుర్ధిగా అత్యంత విశేషమైనదన్నారు. మాఘమాసం నుండి ప్రతిష్టమైన అష్టగణపతి ఉత్సవ విగ్రహాలను కాకినాడ వినాయక సాగర్‌లో సెప్టెంబర్‌ 16న గణేశ నిమజ్జనోత్సవంలో ఆగమశాస్త్ర యుక్తంగా కలశారాధనలతో మంగళ వాయిద్యాల నడుమ వేదపండిత బృందంతో లోకకళ్యాణార్థం విశేష రీతిలో ఉపవాసకుల కుటుంబాలతో గంగార్పణం చేస్తామన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

suneelkumaryandra My Name is Dr Suneelkumar Yandra, Journalist, Writer & Film Director.