పబ్లిక్ గా కూటమి నేతల గాలి తీసిన జలీల్ ఖాన్... వీడియో వైరల్!

రానున్న ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సీట్ కూడా వన్ ఆఫ్ ది హాట్ టాపిక్ సీట్లలో ఒకటనే చెప్పాలి

Apr 18, 2024 - 16:05
 0  9
పబ్లిక్ గా కూటమి నేతల గాలి తీసిన జలీల్ ఖాన్... వీడియో వైరల్!

మనభారత్ న్యూస్, 18 ఏప్రిల్ 2024, ఆంధ్రప్రదేశ్  :-  రానున్న ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సీట్ కూడా వన్ ఆఫ్ ది హాట్ టాపిక్ సీట్లలో ఒకటనే చెప్పాలి. అక్కడ టిక్కెట్ దక్కకపోవడంతో జనసేన నేత పోతిన మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయిపోయారు. ఇదే సమయంలో ఆ టిక్కెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న జలీల్ ఖాన్ కీ టిక్కెట్ దక్కలేదు. అయినా ఆయన పార్టీ మారలేదు కానీ.. కూటమినేతలపై పీకల్లోతు కోపంలో ఉన్నారనే కామెంట్లు మాత్రం వినిపిస్తున్నాయి!

ఊహించని రీతిలో చివరి నిమిషంలో బీజేపీ నేత సుజనా చౌదరి కూటమి తరుపున విజయవాడ వెస్ట్ టిక్కెట్ దక్కించుకున్నారు. దీంతో కూటమిలో భారీ ఎత్తున లుకలుకలు మొదలయ్యాయనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా కూటమి నేతలపై బహిరంగంగానే సెటైర్లు వేశారు జలీల్ ఖాన్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ట్రోలర్స్ కి చేతినిండా పని దొరికిందనే కామెంట్లను సొంతం చేసుకుంది.

వివరాళ్లోకి వెళ్తే... తాజాగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోని కూటమి నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి, విజయ్వాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం కావడంతో స్థానిక మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ ను ప్రచారానికి ఆహ్వానించారు. ఈ సమయంలో మైకందుకున్న జలీల్ ఖాన్ మాట్లడుతున్న సమయంలో... సుజనాచౌదరి, కేశినేని చిన్ని ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు!

దీంతో జలీల్ ఖాన్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. "హాలో సుజనా చౌదరి గారు.. ఓయ్.. హాలో.. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు" అని గట్టిగా పిలిచారు. దీంతో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి.. ఇద్దరు నేతలు అలర్ట్ అయ్యారు. అక్కడితో ఆగని జలీల్ ఖాన్... "మీ రహస్యాలు ఏమైనా ఉంటే మీ ఇంట్లో మాట్లాడుకోండి.. ఇలా పబ్లిక్‌ లో కాదు. మీకోసం రెండు గంటల నుంచి 2 వేల మంది ఎదురు చూస్తున్నారు" అని అన్నారు.

అయినప్పటికీ జలీల్ ఖాన్ కూల్ అవ్వలేదు..! "వన్ టౌన్‌ లో ఉండే కాపులు, ముస్లింలు చాలా మర్యాద ఇస్తారు.. తిక్క లేచిందంటే తాట తీస్తారు. వీళ్లని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి" అంటూ కూటమి నేతలను హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది! 

https://youtube.com/shorts/yOsUIOU-ows?si=Hf5pIbxzDFfiSQhR

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్