దేవాలయ మహిళా EO ఇన్నప్పటిక్ మహిళలకు అవమానం

Jun 29, 2023 - 18:59
 0
దేవాలయ మహిళా EO ఇన్నప్పటిక్ మహిళలకు అవమానం

మహిళా ఈవో ఉండి మహిళలకు అవమానకరం

స్నానమాచరించే చోట ఈ రోజైనా మహిళలకు ఒక టెంట్ వేసి చుట్టూ పట్టాలు కట్టక పోవడంతో మహిళలు శాపనార్ధాలు 

తొలి ఏకాదశి రోజున కూడా ఆమె లేకపోవడం చాలా అవమానకరం* 

లక్షలాది రూపాయలు ట్రెజరీ జీతాలు తీసుకుంటూ వారానికి ఒక్కరోజు వచ్చి వెళ్ళటం ఏమిటని హిందూ ధార్మిక సంస్థలు, ధర్మ ప్రచారకులు భక్తులు విమర్శ

ఇక ఇక్కడ ఉండేది దేవాలయంలో రాజుల పాలన కుటుంబ పాలన

ఇక దేవాలయములో వీరు ఎప్పుడు చేరారో ఎలా ఉద్యోగాలు వచ్చినాయో తెలియదు గానీ ఈ త్రిమూర్తులు పాలన వలన దేవాలయం అగమ్యగోచరం* 

ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లు దేవాలయ పరిస్థితి నోరు ఉన్నోడిదే పెత్తనం ఈ దేవాలయం ఆమ్యామ్యాలకు పెద్ద పీట

ఇక వీరి వెనుక చోటామోటా నాయకులు కొంతమంది అనాగరీకులు ప్రజాప్రతినిధులు.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి పవిత్ర కృష్ణా నదిలో తొలి ఏకాదశి స్నానమాచరించి పెద్దలకు పిండ ప్రధానములు చేసి సనాతన సాంప్రదాయాలను ఆచారాలను నేటి పిల్లలకు కూడా తెలియజేయాలని సత్సంకల్పంతో వృద్ధులు, పెద్దలు, కుటుంబ సభ్యులతో సహా కృష్ణా నదికి వచ్చి పెద్దలకు పిండ ప్రధానం చేస్తూ ఆ కుటుంబ సభ్యులను కూడా ఇలా చేయాలని అలవాటు చేపించటం ఆనవాయితీ . ఎంత చదువుకున్న, ఎన్ని ఉద్యోగాలు చేసినా మన పెద్దలను ఇలా గౌరవించాలి అనే సంస్కృతి నేర్పటం సనాతన ధర్మం .

ఈ కైంకర్యాల అనంతరం కృష్ణా నదిలో స్నానమాచరించి వేదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించు కోవడం గొప్ప సంస్కృతి. అడుగడుగున అప్రశుభ్రం అడుగడుగున దోపిడి అడుగడుగున ఆంక్షలు వీటిని రూపుమాపటానికి 90 శాతం దేవాలయంలో పాత పద్ధతి .10% కొత్త ఈవో అన్నారు ఆమె జాడే ఉండదు.ఇది నేటి వేదాద్రి దేవాలయం పరిస్థితి. దేవాలయ వంశపారంపర్య ధర్మకర్తలు సరైన చర్యలు తీసుకోక పోవడం చే అక్కడ సిబ్బంది ,ఇక్కడ సిబ్బంది కలిసి వారు ఆడింది ఆట పాడిందే పాటగా తయారవుతుంది .అని భక్తులు ,ధార్మిక సంస్థలు ,ధర్మ ప్రచారకులు మండిపడుతున్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్