భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే - బండి రామకృష్ణ

Jun 21, 2024 - 18:25
 0
భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే - బండి రామకృష్ణ
భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే - బండి రామకృష్ణ

మనభారత్ న్యూస్, 21 జూన్ 2024,  ఆంధ్రప్రదేశ్ :- ఉల్లిపాలెం M.P.P స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న స్కూల్ పిల్లలకు NRI వర్రే శివ సహకారంతో జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ పిల్లలకు బుక్స్, పెన్సిల్స్, వాటర్ బాటిల్స్ పౌష్టికాహారం అందజేశారు.

ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులను తమ సొంత పిల్లలు గా భావించి వారికి అర్థమయ్యే రీతిలో బోధన చేయాలని తెలిపారు అక్షరజ్ఞానంతోపాటు లోకజ్ఞానం సమాజం పట్ల అవగాహన చిన్ననాటి నుండే వారికి అవగాహన కల్పిస్తూ దేశభక్తుల జీవితాల గూర్చి పిల్లలకు వివరించాలని చిన్ననాటి నుండి విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలని అన్నారు విద్యార్థినీ విద్యార్థులు కూడా ఉపాధ్యాయులను తమ తల్లిదండ్రులుగా భావించి గౌరవించాలని విద్యార్థిని విద్యార్థులకు హిత బోధ చేశారు.


ఉపాధ్యాయులు బండి రామకృష్ణ దృష్టికి స్కూలుకు అవసరమైన రేకుల షెడ్డు నిర్మాణం గురించి తెలియపరచగా స్పందించిన బండి రామకృష్ణ ప్రభుత్వ నిధులతో షెడ్డు నిర్మాణం ఏర్పాటు చేస్తామని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు.

జనసేన కార్పొరేటర్ ఛాయాదేవి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించి వారికి ఉన్నతమైన విద్యను అందించాలని  కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో స్కూళ్లకు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు గడ్డంరాజు,పినిశెట్టివేణు, తోటరాజేష్,చంద్రం,యశ్వంత్, స్కూల్ ఉపాధ్యాయులు, వర్రేశివ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News