పట్టణ ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన డియంహెచ్ఓ డా సుహాసిని
మనభారత్ న్యూస్, 21 జూన్ 2024, జగ్గయ్యపేట, ఆంధ్రప్రదేశ్ :- జగ్గయ్యపేట పట్టణంలో డయోరియా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ వైద్యశాలను యన్.టి.ఆర్ జిల్లా డియంహెచ్ఓ డా సుహాసిని ఆకస్మిక తనిఖీలు చేసారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగ్గయ్యపేట పట్టణ,నియోజకవర్గ గ్రామాలలో కొన్ని ప్రాంతాలలో ఒక్కటి,రెండు డయోరియా కేసులు నమోదు అవుతున్నాయని ఆమె తెలియజేశారు.ఈ కేసులలో పానిపూరి,బయట హోటల్స్ లలో చికెన్ బిర్యానీలు,తినుబండారాలు తిన్నడం మూలానా మరియు కొన్ని ప్రాంతాలలో త్రాగునీరు కలుషితం అవ్వడం,ఉష్ణోగ్రతల తేడాలు రావడం మూలానా వాంతులు,విరోచనాలతో డయోరియా కేసులు నమోదు అవుతున్నాయని ఆమె తెలియజేశారు.ప్రజలు త్రాగునీరుని కాచి చల్లార్చిన నీటినే త్రాగునీరుగా వాడుకోవాలని,బయట తినుబండారాలను పూర్తిగా వదిలేసి,ఇంట్లో వండుకున్న వంటలను తిన్నాలని ఆమె అన్నారు.ప్రజలు సీజనల్ వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు.ప్రజలు ఎటువంటి అనారోగ్యానికి గురైనా వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ ని సంప్రదించి, డాక్టర్ సూచలన మేర వైద్యం తీసుకోవాలని ఆమె తెలియజేసారు.ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు డయోరియా నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట పట్టణ మరియు బూచవరం వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?