అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకల్లో పాల్గొన్న గౌరీ నాయుడు
మనభారత్ న్యూస్, 04 జూలై 2024, ఆంధ్రప్రదేశ్, పిఠాపురం :- రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ మరియు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం పట్టణానికి చెందిన యువ సాహితీవేత్త, రచయిత, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కిలారి గౌరీ నాయుడు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ‘‘భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి’’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా గౌరీ నాయుడు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు గొప్పతనాన్ని, చరిత్రను విద్యార్థులకు, మన ముందు తరాలకు తీసుకువెళ్లాలని గౌరీ నాయుడు పిలుపునిచ్చారు. భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. బ్రిటీష్ పాలకుల కబంధహస్తాల నుండి మాతృభూమిని కాపాడేందుకు అల్లూరి సాగించిన పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని గౌరీ నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అప్పారావు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లా కళాశాల ప్రిన్సిపాల్ సీతామహాలక్ష్మి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య నరసింహారావు, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ కార్యవర్గ సభ్యులు, అల్లూరి సీతారామరాజు ట్రైబల్ స్టడీస్ సెంటర్ పరిశోధకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
What's Your Reaction?