30 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ?
మనభారత్ న్యూస్ ప్రతినిధి, 7అక్టోబరు 2024, అమరావతి, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జరిగిన జిల్లాల విభజనను వాటి ద్వారా వచ్చిన సమస్యలను కరెక్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం పూర్తి ప్రతిపాదనలు రెడీ చేసింది. మొత్తం 30 జిల్లాలగా పునర్విభజన చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం డ్రాఫ్ట్ రెడీ అయినట్లుగా చెబుతున్నారు. ఏపీ చిన్నా తక్కువ జనాభా ఉన్న, 17 మాత్రమే పార్లమెంట్ స్థానాలు అదీ కూడా గ్రేటర్ పరిధిలోనే అత్యధిక జనాభా ఉన్నప్పటికి 33 జిల్లాలుగా చేశారు. కానీ ఏపీలో 26 జిల్లాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాలకు సరైన ప్రాతిపదిక లేకుండా పోయింది. కొన్ని జిల్లాలకు అసలు హెడ్ క్వార్టర్ ఎక్కడో వందల కిలోమీటర్ల దూరం ఉంది. అల్లూరి జిల్లా విషయంలో ఇదే తప్పు జరిగింది. అందుకే చంద్రబాబు తాము వస్తే జిల్లాల విభజన విషయంలో జరిగిన తప్పును సరి చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు కసరత్తు పూర్తయినట్లుగా తెలుస్తోంది. తాజాగా పలాస, నాగావళి, నూజివీడు, తెనాలి, అమరావతి కేంద్రంగా అమరరామ , మార్కాపురం, మదనపల్లి, హిందూపురం,ఆదోని గా కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్లుగా డ్రాఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జగన్ జిల్లాలను మార్చారు కానీ… ఇంకా ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే ఎక్కువ పనులు జరుగుతున్నాయి. దీనికి కారణం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడమే. జిల్లాల విభజన చేసి తన పని అయిపోయిందనుకున్నారు జగన్. కానీ కొన్ని పాలనాపరమైన ఇబ్బందులు ఎదురౌతున్నందున, ఇప్పుడు మొత్తాన్ని సంస్కరించి.. మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. .
What's Your Reaction?