తెలుగు జాతి గర్వించే నేత వంగవీటి మోహన రంగ

Jul 4, 2023 - 14:33
Jul 4, 2023 - 14:33
 0
తెలుగు జాతి గర్వించే నేత వంగవీటి మోహన రంగ

మనభారత్ న్యూస్, 07 జులై 2023, ఆంధ్రప్రదేశ్ : తెలుగుజాతి గర్వించే నేత దివంగత వంగవీటి మోహన్ రంగా గారు అని ఆయన ఆశయ సాధనలో ముందుకు సాగుదామని రాష్ట్ర ప్రభుత్వవిప్,శాసనసభ్యులు ఉదయభాను గారు పేర్కొన్నారు.

మంగళవారం నాడు కీర్తిశేషులు దివంగత వంగవీటి మోహన్ రంగా గారి 76 వ జయంతిని పురస్కరించుకొని కోదాడ రోడ్డు నందు ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరంరాష్ట్ర ప్రభుత్వవిప్,శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులతో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు జరిగే జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు భారీ ర్యాలీతో తరలి వెళ్లారు.

ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటూ వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన్రంగా గారని అన్నారు. రంగా గారు ఒక కులానికో,ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆరాధ్య దైవంగా భావించే గొప్ప శక్తి అన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్