మురుగు నీటితో ప్రజల ఇబ్బందులు - చోద్యం చూస్తూన్న మధిర మున్సిపాలిటీ

Jul 4, 2023 - 14:37
Jul 4, 2023 - 14:38
 0  37
మురుగు నీటితో ప్రజల ఇబ్బందులు - చోద్యం చూస్తూన్న మధిర మున్సిపాలిటీ

మనభారత్ న్యూస్, 07 జులై 2023, తెలంగాణ : 

100 కోట్ల అభివృద్ధి చేసాం అని చెప్పుకుంటున్న మున్సిపాలిటీ పాలకవర్గం ఎక్కడ మీ అభివృద్ధి... 
-- జహంగీర్

 మధిర పట్టణ నడిబొడ్డున.. నిత్యం 100 ల సంఖ్యలో వాహనాల రాకపోకలు 1000 సంఖ్యలో ప్రజలు, స్కూల్ విద్యార్థులు నడిచే రహదారి గత పదిహేను రోజుల నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద మురుగు నీరు వాగుల మరి ప్రజలు తిరగడానికి ఇబ్బందులు పడుతూ.. మున్సిపాలిటీ వాళ్ళని తిట్టుకుంటూ.. ఆ మురుగునీటిలో నడుస్తున్నారు..నిత్యం ఆ దారిలో తిరిగే మున్సిపాలిటీ కౌన్సిలర్ లు అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప కాలువలో పూడిక తీయటం లేదు.. ఇదే నా మీరు చేస్తున్న పట్టణ అభివృద్ది.. పందులు గుంపులు గుంపులు గా చేరి ప్రజలు నడవడానికి ఇబ్బంది పడుతున్నారు...

మధిర మున్సిపాలిటీ గా మరి 10 సంవత్సరాలు అవుతున్న  రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద శాశ్వత పరిష్కారం చేయటం లేదు దశాబ్ది ఉత్సవాలకు అందమైన బ్రోచర్లు వేసి మధిర పట్టణం లో 100 కోట్ల అభివృద్ధి చేసాం అని చెప్పుకుంటున్న మున్సిపాలిటీ పాలకవర్గం ఎక్కడ మీ అభివృద్ధి... కొద్దీ పాటి వర్షానికి మధిర పట్టణంలో రోడ్లు మొత్తం జలమయం అవుతున్నాయి, కాలువల్లో పూడిక చెత్త తీసే వాళ్ళు లేక కాలువలు దుర్గంధం వేదజల్లు తున్నాయ్... ప్రజలు జీవించడానికి కనీస సౌకర్యాలు కల్పించలేదు బ్రిడ్జి మీద లైట్లు పెట్టి,  ట్యాంక్ బాండ్ కట్టాము మధిర అభివృద్ధి అయి పోయింది అని చెప్పుకుంటున్నారు..మధిర పట్టణంలో ఏ వీధికి వెళ్లిన సమస్యలు కుప్పలు తెప్పలుగా వున్నాయి... ప్రజలు పట్టణంలో లో జీవించడానికి కావాల్సిన వసతులు కల్పించి అప్పుడు గొప్పలు చెప్పుకోండి.. అంతే కాని పై పై మెరుగులు దిద్ది అభివృద్ధి చేసాం అంటే మధిర ప్రజలు విజ్ఞాన వంతులు అన్ని గమనిస్తూనే ఉంటారు... 

 జహంగీర్ 
మధిర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్