వైసీపీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా కలిసి పని చేస్తాం: రామకృష్ణ
మండలి ఎన్నికలను కూడా సీఎం జగన్ భ్రష్టు పట్టించారని వ్యాఖ్య
మనభారత్ న్యూస్, 15 మార్చి 2023 తిరుపతి : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లో వైసీపీనే గెలవాలన్న దురుద్ధేశంతో సీఎం జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, జగనొక రాజకీయ బకాసురుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా తాము కలిసి పని చేస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అన్నీ ఎన్నికల్లో వైసీపీనే గెలవాలన్న దురుద్ధేశంతో జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, జగనొక రాజకీయ బకాసురుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్రంలో సీఎం జగన్ పాలనను, వైసీపీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా తాము కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నామని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తిరుపతిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను మళ్లీ నిర్వహిచాల్సిన అవసరం ఉందని రామకృష్ణ పేర్కొన్నారు. వైసీపీ నేతలు ఓటర్ల ఇళ్లల్లోకి వెళ్లి, డబ్బులు పంచిపెట్టారని గుర్తు చేశారు. ఓట్లకు డబ్బులను పంచే బదులు ముఖ్యమంత్రే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా ఓటర్ల ఖాతాల్లోకి నగదును జమచేయొచ్చు కదా అని ప్రశ్నించారు. మండలి ఎన్నికలను ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా దిగజార్చలేదని రామకృష్ణ ధ్యజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లో వైసీపీనే గెలవాలనే దురుద్ధేశంతోముఖ్యమంత్రి జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసినట్లు.. మండలి ఎన్నికలను కూడా సీఎం జగన్ భ్రష్టు పట్టించారని వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లు, డబ్బుల పంపిణీతో ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ అపహాస్యం చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.
What's Your Reaction?