నాసిక్‌ నుంచి ముంబయి వరకు 10 వేల మందితో కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌

వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెంచాలని కోరుతూ నిరసన

Mar 15, 2023 - 18:48
Mar 25, 2023 - 01:36
 0
నాసిక్‌ నుంచి ముంబయి వరకు 10 వేల మందితో కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌

మనభారత్ న్యూస్, 15 మార్చి 2023 : 10 వేల మందితో నాసిక్‌ నుంచి ముంబయి వరకూ సాగే కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ను సోమవారం ఎఐకెఎస్‌ ప్రారంభించింది.ఉల్లిపాయలకు క్వింటాల్‌కు రూ.2000 మద్దతు ధర ప్రకటించాలని, పత్తి, సోయాబీన్‌, పచ్చి మిర్చి, పాలు, పప్పు ధాన్యాల ఉత్పత్తులకు లాభదాయక ధర ప్రకటించాలని ఇటువంటి 17 డిమాండ్లతో కూడిన చార్టర్‌ను అది ముందుకు తెచ్చింది. 

రైతుల రుణమాఫీ, పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ బిల్లుల రద్దు, వ్యవసాయానికి 12 గంటలపాటు విద్యుత్‌ సరఫరా చేయాలని, అకాల వర్షాలు, ఇతర ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన పంటలకు ప్రభుత్వం, బీమా కంపెనీలు నష్ట పరిహారం ఇవ్వాలని ఆ డిమాండ్ల చార్టర్‌ కోరుతున్నది. 

ఇప్పటికే సాగులోఉన్న అటవీ భూములు, పచ్చిక బయళ్లు,దేవాలయ,ఇనాం వక్ఫ్‌, బినామీ భూములను సాగుదార్ల పేరుతో పట్టాలు ఇవ్వాలని మార్చ్‌ డిమాండ్‌ చేస్తోంది. 

పిఎం హౌసింగ్‌ స్కీమ్‌ సబ్సిడీని రూ. 1.40 లక్షల నుంచి రూ 5 లక్షలకు పెంచాలని, కొత్తగా సర్వే నిర్వహించి దరఖాస్తు దారుల పేర్లను 'డి' లిస్టులో ఉంచాలని, ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో భూ సేకరణ చేయాల్సి వస్తే కేరళ ఫార్ములా ప్రకారం పరిహరం ఇవ్వాలని మార్చ్‌ డిమాండ్‌ చేస్తోంది.

వయోజన, ప్రత్యేక పింఛన్‌ను నెలకు రూ. 4 వేలకు పెంచాలని,2005 తరువాత చేరిన ప్రభుత్వోద్యోగులకు పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్దరించాలని,ఎయిడెడ్‌ పాఠశాలలకు 100 శాతం నిధులు ఇవ్వాలని, ప్రభుత్వ పోస్టుల్లో ఖాళీలను భర్తీ చేయాలని, కాంట్రాక్ట్‌ కార్మికులు, స్కీమ్‌ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వ ఉద్యోగుల్లో బోగస్‌ ఆదివాసీలను తొలగించి, వారి స్థానంలో నిజమైన ఆదివాసీలను నియమించాలని ఎఐకెఎస్‌ మార్చ్‌ డిమాండ్‌ చేసింది. 

ఈ మార్చ్‌కు ఎఐకెఎస్‌ అఖిల భారత అధ్యక్షులు, పొలిట్‌ బ్యూరో సభ్యులు అశోక్‌ ధావలే, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యులు ఉదరు నర్కర్‌, కేంద్ర కమిటీ సభ్యులు జెపి గవిత్‌, ఐద్వా అఖిల భారత ప్రధాన కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యులు మరియం ధావలే, ఎఐకెఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అజిత్‌ నవాలే నేతృత్వం వహిస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్