H3N2 Virus: డేంజర్ బెల్స్.. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపిస్తున్న వైరస్

సాధారణ జలుబు, ఫ్లూ జ్వరంలాగే దీన్ని కూడా లైట్ తీసుకున్నారు

Mar 15, 2023 - 13:23
Apr 17, 2023 - 13:52
 0
H3N2 Virus: డేంజర్ బెల్స్.. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపిస్తున్న వైరస్

మనభారత్ న్యూస్, 15 మార్చి 2023, హైదరాబాద్

దేశంలో వైరస్ హెచ్3ఎన్2 వేగంగా వ్యాపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా హెచ్3ఎన్2 తెలుగు రాష్ట్రాలకు పాకింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఐసీఎమ్ఆర్ అప్రమత్తం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు జరుగుతుండడం, వైద్యం కోసం తెలుగు రాష్ట్రాలకు క్యూకడుతున్న విదేశీయులు ఊపందుకున్న పర్యాటకం వైరసి.హెచ్3ఎన్2 వైరస్ వేగంగా వ్యాపించేందుకుకారణమవుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

ప్రజలు మాస్కులు వాడటం లేదని కూడా వెల్లడించాయి. 

కరోనా కేసులు తగ్గిన తర్వాత ఇప్పుడు భారత్ లో హెచ్3ఎన్2 రకం వైరస్ బారిన పడేవారి సంఖ్య ఎక్కువైంది. 

సాధారణ జలుబు, ఫ్లూ జ్వరంలాగే దీన్ని కూడా లైట్ తీసుకున్నారు. 

అయితే, ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరస్ విజృంభిస్తోంది. 

మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. 

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News