మొదలైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ పర్వం

12 బిల్లులతో ప్రభుత్వం.. 15 ప్రజా సమస్యలపై ప్రతిపక్షం

Mar 15, 2023 - 13:29
 0
మొదలైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ పర్వం

మనభారత్ న్యూస్, 15 మార్చి 2023, వెలగపూడి : శాసన సభ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 12 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు అసెంబ్లీలో పెట్టే చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో 15 పైగా ప్రజా సమస్యలపై ఉభయ సభల్లో చర్చకు పట్టుపట్టాలని తెలుగుదేశం శాసనసభా పక్షం నిర్ణయించింది.

శాసన సభ బడ్జెట్ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగించారు. ఈ నెల 16 తేదీన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 12 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం వుంది. అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగం అనంతరం 12 గంటలకు ఏపీ కెబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీలో ఆమోదించాల్సిన బిల్లులు, చట్ట సవరణలకు ఆమోదం మంత్రి వర్గం తెలపనుంది. దొంగ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ, జిల్లా రిజిస్ట్రార్లకు దఖలు పరుస్తూ చట్ట సవరణ‍ చేయనుంది. ఈ మేరకు అసెంబ్లీలో పెట్టే చట్ట సవరణ బిల్లుకు కెబినెట్ ఆమోదం తెలపనుంది.

మద్యం అక్రమ రవాణ : మద్యం అక్రమ రవాణలో అవగాహన రాహిత్యం వల్ల కేసుల్లో చిక్కుకున్న వారికి ఊరట కలిగించేలా కెబినెట్ చర్యలు చేపట్టనుంది. ఒక్కసారి మాత్రమే పట్టుబడ్డ వారిపై కేసుల ఎత్తివేయాలనే ప్రతిపాదనపై మంత్రి వర్గం చర్చిెంచనుంది. సుమారు 45 వేల కేసులు, భారీ ఎత్తున సీజైన వాహనాలు ఉన్నట్టు సమాచారం. ఇలాంటి కేసుల్లో ఉన్న వారికి ఊరట కలిగించేలా కెబినెట్లో చర్చించనున్నారు.

15 పైగా ప్రజా సమస్యలపై : ఇక ప్రతి పక్ష హోదాలో తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్దమైంది. అందుకు సంబంధించి ఈ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో 15 పైగా ప్రజా సమస్యలపై ఉభయ సభల్లో చర్చకు పట్టుపట్టాలని తెలుగుదేశం శాసనసభా పక్షం నిర్ణయించింది. విద్యుత్ చార్జీల పెంపు, రైతు సమస్యలు, పోలవరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టులు, నిరుద్యోగం, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం, ప్రతిపక్షాల పర్యటనలపై ఆంక్షలు, కేసులు వంటి పలు అంశాలపై చర్చ వచ్చేలా చూడడనుంది. ఇందు కోసం కనీసం 20 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరగాలనే డిమాండ్‌ ను ప్రభుత్వం ముందు తెలుగుదేశం ఉంచనుంది.

సమావేశాల తొలి రోజులో భాగంగా వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ నుంచి ర్యాలీగా శాసనసభకు వచ్చారు. సభలో కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ తొలి ప్రసంగం కావడంతో సంయమనంతో వ్యవహరించాలని శాసనసభాపక్షం ఆలోచనలో ఉంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాతనే అందులో అంశాల ఆధారంగా స్పందించాలని నేతలు నిర్ణయించారు. ప్రజ సమస్యలతో పాటుగా ప్రతి పక్షాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సభలో గట్టిగానే ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉన్నట్లు సమాచారం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News