స్మార్ట్ సిటీ (2016-24) శ్వేతపత్రం ప్రకటించాలి
పౌర సంక్షేమ సంఘం
మనభారత్ న్యూస్, 28 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, కాకినాడ :- కాకినాడ జిల్లా కేంద్రంలో 2016 నుండి 2024 వరకు చేపట్టిన ఏడేళ్ల స్మార్ట్ సిటీ నిధుల పనులపై శ్వేతపత్రం ప్రకటించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. గడచిన రెండు ప్రభుత్వాల హయాంలో గోడలకు చెట్లకు రంగులు, ప్రహరీలు, కూల్చిన నిర్మాణాలు మినహా పారిశుద్ధ్యం త్రాగునీరు ముంపు నివారణలో ప్రగతి తీసుకురాలేదన్నారు. వాటర్ వర్క్స్‌ను ఆక్రమించిన కంపెనీ భవనం గోదావరి కళాక్షేత్ర సైన్స్ సెంటర్ ప్రయోజనశూన్య సైకిల్ ట్రాక్ మినహా వృద్ధి దక్కలేదన్నారు. లిమిటెడ్ కంపెనీగా మార్చడం వలన ఎసిబి, విజిలెన్స్ దర్యాప్తు లేకపోయిందన్నారు. స్మార్ట్ పెత్తనంలో ఆస్తులు ఆదాయాలు అభివృద్ధి నిర్వీర్యం చెందాయన్నారు. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా బాగున్న సిసి రోడ్లను రెట్టింపు ఎత్తు చేయడం వలన ఇండ్లు లోతట్టుగా మారి మురుగు ముంపుతో కునారిల్లుతున్నాయన్నారు. కంపెనీ పెత్తనంతో స్థానికపాలనకు గ్రహణం పట్టిందన్నారు. అధికారుల అక్రమార్జన పై దర్యాప్తు జరగాలన్నారు. స్మార్ట్ నిధుల దుర్వినియోగంపై విచారణ ప్రకటనలు కార్యరూపం దాల్చలేదన్నారు. శ్వేతపత్రంతో బాటుగా 8గ్రామాల విలీనంతో కాకినాడ విస్తీర్ణాన్ని పెంచాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు.
What's Your Reaction?