నిరుపేద కుటుంబాల పాలిట వరమే చంద్రన్నభీమా - జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు
చంద్రన్నభీమా జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు
మనభారత్ న్యూస్, 27 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, పిఠాపురం :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు క్రొత్తగా ఏర్పడిన ఎన్డీయే (జనసేన, తెలుగుదేశం, బిజెపి) ప్రభుత్వం చంద్రన్నభీమాను రూ.5లక్షల నుంచి 10లక్షల రూపాయలకు పెంచిన సందర్భంగా శుక్రవారం గొల్లప్రోలు మండలం చేబ్రోలు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన జిల్లాకార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్డీయే (జనసేన, తెలుగుదేశం, బిజెపి) ప్రభుత్వం ఏర్పడి పదిరోజులు కావస్తున్న తరుణంలో చంద్రన్నభీమాను ఐదులక్షల నుంచి పదిలక్షలు రూపాయలకు పెంచడం ఎంతో సంతోషకరమని, పేదల పాలిట వరముగా భావించవచ్చనని, బడుగు బలహీనవర్గాలు, నిరుపేద కుటుంబాలలో ప్రధాన సంపాదనపరుడు ప్రమాదవశాత్తు మరణించినప్పుడు గత వైసిపి ప్రభుత్వం కనీసం ఐదులక్షల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితుల్లో నేడు ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రివర్గం చంద్రన్న భీమాను రూ.5లక్షల నుంచి 10లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమని జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయరంగంలో పనిచేసే కూలీలు, భవన నిర్మాణరంగంలో పని చేసేవారు, పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామికరంగంలో పనిచేస్తున్న పేద, బడుగు, బలహీనవర్గాల కోసం ఇటువంటి భీమా కార్యక్రమాన్ని పెట్టి ఆయా కుటుంబాలకు రాష్ట్రం ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం భరోసానివ్వడం జరిగిందని ఇది పేదల ప్రభుత్వం తెలియజేయడానికి చంద్రన్న భీమా పథకమే ఒక నిదర్శనమని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల కార్యకర్తలు ఎన్డీయే కూటమి తరపున చంద్రన్నభీమా పథకాన్ని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందేందుకు క్షేత్రస్థాయిలో తగు సహాయ సహకారాలు అందించాలని జ్యోతుల శ్రీనివాసు ఈ సందర్భంగా సభ ముఖంగా కోరారు.
What's Your Reaction?