తూర్పుకనుమల్లో తలపులు తీర్చే "తలుపులమ్మలోవ"
అగస్త్యుని-ఆరాధనతో-ఆవిర్భవించిన-శక్తిపాతం-..-ఆషాఢంలో-ప్రత్యేక-వైభవం
మనభారత్ న్యూస్, 05 జూలై 2024, ఆంధ్రప్రదేశ్ :- స్వయంభుగా వెలిసినఈ అమ్మ వారిని తలుపు లమ్మ తల్లి అని పిలుస్తారు. తన భక్తుల తలంపుతోనే అమ్మవారు 'తలు పులమ్మ' గా లోవలో ఆవిర్భవించారు. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతోన్న ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలుదర్శన మిస్తుంటాయి. ఈ కొండలలో ఒకదానిని 'ధారకొండ' గానూ మరొక దానిని 'తీగకొండ' గా పిలుస్తారు. ఈ రెండు కొండల మధ్య 'తలుపులమ్మ' అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి సంధ్యా వందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటి జాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను తలంచిన క్రమంలో కొండపైన పాతాళగంగ ధారా పాతమై సంధ్యా వందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు ఆప్రాంతంలోనే చాలాకాలం వుండి ఆరాధన చేసుకున్నారన్నది క్షేత్ర విశేషం. పాతాళ గంగ జలధారల నడుమనే అమ్మవారు కొండ గుహలో కొలువుదీరారు. కాలక్రమంలో తలుపులమ్మగా సకల శుభాలను సర్వజనులు పొందుతున్నారు. తొలుతగా అటవీ ప్రదేశంలోని కొండ జాతుల తెగలకు చెందిన జనులు శక్తి దేవతగా ఆరాధించారు. కాలక్రమంలో ప్రధానంగా కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత అమ్మ వారికి పూజలు చేయడానికి ఎక్కువగా సందర్శిస్తారు. ప్రతి ఆషాఢ మాసంలో జరిగే అమ్మవారి ఉత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. తుని పరిసర ప్రాంతాల రైతులు తాము పండించే పంటలను, కూరగాయలను అమ్మవారికి అలంకరణగా అందజేస్తారు. పాడిపంటలు పుష్కలంగా పండి కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటారు. వాహన పూజ చేయించుకునే వారు కోడి, మేక వంటి వాటిని వెంట తెచ్చుకుని అక్కడే వండి అక్కడే ఆహారాన్ని భుజిస్తారు. మిగిలింది ఇంటికి తెచ్చుకోరు. అక్కడే పంచి పెట్టేస్తారు. ఈ ఆచారం పూర్వీకుల కాలంలో దట్టమైన అడవుల నుండి వచ్చే గిరిపుత్రుల కుటుంబ ఆచార సంప్రదాయాల నుండి ఏర్పడింది. ఈ దేవస్థానం యొక్క ప్రధాన పండుగ "చైత్రమాసం"లో ప్రతి "బహుళ విద్యా తధియ" నుండి ప్రారంభమయ్యే 15 రోజుల పాటు జరుపుకుంటారు. "ఆషాడ మాసం" సమయంలో పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు. తూర్పు కనుమ లదేవతగా తలుపులమ్మను పూజిస్తారు. ఏడాదికి ఒకసారైనా దర్శించి సకుటుంబ సమేతంగా పిల్లా పాపలతో తమ తలపులను అమ్మవారి ముందుంచి ఆశీర్వాదం పొందాలని కాకినాడ స్వయంభుభోగిగణపతి పీఠంలో జరిగే ఆధ్యాత్మి క కార్యక్రమాల్లో పేర్కొంటారు. దేశ విదేశాల్లో ఎక్కడవున్నా తూర్పు తీరంలో జన్మించిన ప్రతి ఒక్కరూ తలుపులమ్మ తల్లి దర్శనం చేసుకోని వారుండరు.
What's Your Reaction?