తెలుగింటి పెద్దమ్మ పెదాపురం 'మరిడమ్మ'
ఆషాఢంలో-వృద్ద-మాతలకు-నూతన-వస్త్రాలివ్వాలి-:-కాకినాడ-భోగిగణపతి-పీఠం
మనభారత్ న్యూస్, 05 జూలై 2024, ఆంధ్రప్రదేశ్, కాకినాడ :- తెలుగింటి పెద్దమ్మగాపెద్దాపురం మరిడమ్మ తల్లిని ఆషాఢంలో ప్రతి ఇంటి ఆడపడుచులు దర్శించడం సనాతన శుభ సంప్రదాయమని స్వయంభు భోగి గణపతి పీఠం పేర్కొంది. శుక్రవారం మధ్యాహ్నం అమ్మవారి నైవేద్య నివేదన అనంతరం కాకినాడ నుండి వచ్చిన గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు వరలక్ష్మీ దంపతులు మరిడమ్మను దర్శించారు. వృద్ద మాతలకు నూతన వస్త్రాలందజేసారు. ప్రతి గృహిణి తమ గృహాల్లో గ్రామదేవతలకు నివేదించే నైవేద్య వితరణలో వృద్ధ మాతలకు నూతన వస్త్రాలందించడం వలన శుభఅనుగ్రహం దివ్యంగా కలుగుతుందన్నరు. మరిడమ్మ తల్లి మహిమాన్వితమైన గ్రామ దేవతల పెద్దమ్మగా పేర్కొన్నారు. గత ఏడాది గణపతి కవచ యజ్ఞం సందర్భంగా చేపట్టిన తిరుమల ప్రదిక్షణ, పాదయాత్ర మరిడమ్మ అనుగ్రహంతోనే విజయవంతమయ్యిందని పాత్రికేయులకు వివరించారు. అధికారులు ప్రత్యేక దర్శనం చేయించి పూజారుల ఆశీర్వచనం అందించారు.
What's Your Reaction?