పెనుగంచిప్రోలు పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

మిత్రునికి సహాయం...

Jan 15, 2024 - 19:00
 0
పెనుగంచిప్రోలు పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం
పెనుగంచిప్రోలు పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

పెనుగంచిప్రోలు జనవరి 15 (మనభారత్ న్యూస్) వారంతా 20 సంవత్సరాల క్రితం కాకాని వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్నారు,ఆడారు పాడారు బాల్యంలో చేయాల్సిన చిలిపి పనులన్నీ చేశారు 20 సంవత్సరాల తర్వాత తమ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బాల్యమిత్రులు ఏ ఏ పొజిషన్లో ఉన్నారు తెలుసుకోవాలని అనుకున్నారు అనుకున్న వెంటనే గ్రామంలో కొంతమంది స్నేహితులని కలిసి తమ ఆలోచనని వివరించారు మిత్రులు అందరూ అంగీకారం తెలపడంతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టారు. మిత్రుల ఫోన్ నెంబర్ సేకరించి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఒక కమిటీ వేసుకొని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఆహ్వానించారు. ఆదివారం రోజు పెనుగంచిప్రోలు గ్రామంలోని కాకాని వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో 2003- 2004 పదో తరగతి చదివి 2004లో ఉత్తీర్ణులైన విద్యార్థులు 20 సంవత్సరాల తరువాత తమ బాల్య మిత్రులను కలుసుకోవడానికి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక మక్కపేట రోడ్డులోని తంబరేణి గార్డెన్స్ లో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాట్లాడుతూ అప్పటి కాలంలో విద్యార్థుల్లో ఉన్న క్రమశిక్షణ, వినయ విధేయతలు, భయము, భక్తి నేటితరం విద్యార్థులలో మచ్చుకైన కనిపించట్లేదు అనిఅన్నారు. మరియు తమ దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండడం తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ కన్నబిడ్డలతో సమానమని ఇంకా ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థిలు అందరూ తమ బాల్య స్నేహితులందరికీ కలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు.

మిత్రుడికి ఆర్థిక సహాయం

తమతో పాటు చదువుకున్న బాల్య స్నేహితుడు ముండ్లపాటి రాజేష్ ఆరోగ్య, కుటుంబ పరిస్థితి బాగోలేదని తెలుసుకొని తమ మిత్రుడు మాదినేని శివ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయగా అప్పటికప్పుడు మిగిలిన మిత్రులు తమ వంతు సహాయంగా 16,500 కలిపి మొత్తముగా 26,500 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నందుకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అప్పటి పెనుగంచిప్రోలు ఎంఈఓ హెచ్ఎం ప్రస్తుత నూజివీడు డివై ఈవో సేవ్య నాయక్, అప్పటి ఉపాధ్యాయుడు ప్రస్తుత ముత్యాల పాఠశాల హెడ్మాస్టర్ బివీఎస్ కోటేశ్వరరావు. టీచర్లు రామకోటేశ్వరరావు, చుంచు శ్రీనివాసరావు, కే శ్రీనివాసరావు, ఇందిరా, హంసలి, కాంత, శ్రీలక్ష్మ, లతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News