డయేరియా బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పిన శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

Jun 21, 2024 - 18:30
 0
డయేరియా బాధితులను పరామర్శించి  ధైర్యం చెప్పిన శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

మనభారత్ న్యూస్, 21 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, జగ్గయ్యపేట :- జగ్గయ్యపేట చుట్టుప్రక్కల  గ్రామాలలోకలుషిత నీరు తాగి కొంత మందికి డయేరియా సోకడం వలన వారిని జగ్గయ్యపేట పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ కి మరి కొంతమందిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించడం జరిగింది. విషయం తెలుసుకున్న టిడిపి జాతీయ కోశాధికారి & శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు హుటాహుటిన హాస్పటల్ కి చేరుకొని డాక్టర్ అనిల్ కుమార్ గారు, సూపర్వైజర్ వెంకట్రావు గారు, రమేష్ గార్లతో కలిసి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ విషయంపైన  శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు డిఎంహెచ్వో గారితో మాట్లాడి గ్రామంలోని వైద్య బృందాలను పంపించాలని అదేవిధంగా డయేరియా బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంలో జగ్గయ్యపేట నుండి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్య కోసం వెళ్లిన వారికి డిఎంహెచ్ఓ గారు గవర్నమెంట్ సూపర్వైజర్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News