బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడిరచిన వ్యక్తి అల్లూరి - జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు
మనభారత్ న్యూస్, 04 జూలై 2024, ఆంధ్రప్రదేశ్, పిఠాపురం :- మన్యంవీరుడు, విప్లవజ్యోతి స్వర్గీయ అల్లూరి సీతారామరాజు జయింతి సందర్భంగా వన్నెపూడి-కొడవలి కూడలిలో జాతీయరహదారి పైన గల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద జయంతోత్సవాలకు కొడవలి అల్లూరి సీతారామరాజు యూత్ కమిటి వారి ఆహ్వానం మేరకు జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు హాజయిరై అల్లూరి సీతారామరాజు 127వ జయంతోత్సవాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అల్లూరి సీతారామరాజు విగ్రహనికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు. అనంతరం జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులోనే నాటి దుష్ట బ్రిటిష్ పాలను అంతమొందించాలని, బ్రిటిష్ వారిపై మన్యప్రాంతం నుండి స్వతంత్ర ఉద్యమం చేశారన్నారు. ఈ సందర్భంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడిరచారు. అల్లూరి సీతారామరాజు అతి చిన్నవయసులోనే బ్రిటిష్ పాలకుల తుపాకులకు అల్లూరి సీతారామరాజు బలైపోయారని తెలియజేశారు. కాబట్టి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజును నాటి బ్రిటిష్ పాలకులు పొట్టన పెట్టుకున్నారని బ్రిటిష్ వారిని మన ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడంలో అల్లూరి సీతారామరాజు ముఖ్యపాత్ర పోషించారని తెలియజేశారు. ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన ప్రజలందరికీ స్వీట్స్‌ను పంచారు. ఈ కార్యక్రమంలో కొడవలి గ్రామ జనసేన అధ్యక్షుడు నక్కా నారాయణమూర్తి, మద్దాల రామకృష్ణ, మల్లిపాం కోటేశ్వరరావు, పీర్ల నాగార్జున, నక్కా ప్రకాష్, ఎం.పండు, నక్కా వంశీ, పీర్ల సింహాద్రి, కుక్కా శ్రీను, కొమ్మూరి కృష్ణ, ఆకుల అర్జున్, జ్యోతుల సీతరాంబాబు, శాఖ సురేష్, వట్టూరి శ్రీను, మేడిబోయిన శ్రీను, కాపారపు పూసలు, జ్యోతుల గోపి, సఖినాల రాంబాబు, మంతెన గణేష్ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?