అనంత ఆధ్యాత్మికం ‘‘విష్ణుసహస్రనామం’’
విష్ణుసహస్రనామం
మనభారత్ న్యూస్, 29 జూన్ 2024, ఆంధ్రప్రదేశ్, కాకినాడ :- మహాభాగవతులు, ఆళ్వారులు, వాగ్గేయకారులు పారాయణచేసిన విష్ణుసహస్రం శాంతి సంపద కలిగించే అనంత ఆధ్యాత్మిక స్తోత్రమని భోగిగణపతిపీఠం పేర్కొంది. శనివారం ఉదయం సుప్రభాత వేళ 38వశ్రీవారి సంకీర్తనలో విష్ణు పారాయణ నిర్వహించారు. మహాభారత అనుశాసనిక పర్వం149వ అధ్యాయంలో విష్ణు నామాలు అనంత ఆధ్యాత్మికమని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. గణపతి వేంకటేశ్వర విగ్రహా మూర్తులకు క్షీరాభిషేకం, దధ్యాభిషేకం, ఆజ్యాభిషేకం, మధుఅభిషేకం, శర్కరాభిషేకం చేశారు. శ్రీవారి భక్తులకు పసుపు కుంకుమ, రవిక, గాజులు ప్రదానం చేసారు.
What's Your Reaction?