తిరుపతి జిల్లాలో "క్రాఫ్ట్ విలేజ్" త్వరగా పూర్తి చేయండి
పార్లమెంట్ జీరో హావర్ లో నేతన్నల కష్టాలను ఏకరువు పెట్టిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
మనభారత్ న్యూస్, 24 మార్చి 2023, తిరుపతి : జౌళి మంత్రిత్వ శాఖ 2016-17 ఆర్థిక సంవత్సరంలో తిరుపతి జిల్లాలో రూ.955.00 లక్షలతో "క్రాఫ్ట్ విలేజ్ ఏర్పాటు"ని మంజూరు చేసిందని జిల్లాల పునర్విభజన జరగక ముందు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి అంతర్భాగంగా ఉన్నపుడు డి.ఆర్.డి.ఏ మొదటి విడతగా 50% నిధులు రూ.477.50 లక్షలను మాత్రమే అందుకొందని చెప్పారు. గత 2 సంవత్సరాలుగా కోవిడ్-19 మహమ్మారిలో భూమి ఎంపిక మరియు క్రాఫ్ట్ విలేజ్ నిర్మాణ కార్మికులు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యల కారణంగా క్రాఫ్ట్ విలేజ్ ఆలస్యమైందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అండ్ బి తిరుపతి వారి లెక్కల ప్రకారం క్రాఫ్ట్ విలేజ్ కోసం రూ.516.45 లక్షల పనులు పూర్తయ్యాయని చిత్తూరు జిల్లాలో భాగంగా ఉన్నపుడు కేటాయించిన నిధులకు సంబంధించి నిర్మించిన పనులకు చిత్రాలతో కూడిన పనుల పురోగతి నివేదిక సమర్పించబడిందని సభ దృష్టికి తీసుకెళ్లారు. కావున తిరుపతిలో చేనేత వృత్తిపై ఆధారపడి వారి జీవనోపాధికి ఉపయోగపడే క్రాఫ్ట్ విలేజ్‌ని పూర్తి చేయడానికి గడువును పొడిగించడం ద్వారా రెండవ విడత మొత్తాన్ని మంజూరు చేయాలని గౌరవ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అభ్యర్ధించారు.
What's Your Reaction?