శుక్రవారం నుండే రంజాన్ మాసం ప్రారంభం
నెలవంక కనిపించడంతో శుక్రవారం నుండి మాసం ప్రారంభం కానుందని ముస్లిం మత పెద్దలు తెలిపారు
మనభారత్ న్యూస్, 24 మార్చి 2023 : ఈరోజు నెలవంక కనిపించడంతో శుక్రవారం నుండి మాసం ప్రారంభం కానుందని ముస్లిం మత పెద్దలు చెప్పారు. శుక్రవారం నుండి మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
పవిత్ర దైవ గ్రంథం ఖురాను అవతరించినది. రంజాన్ మాసంలోనే ... రంజాన్ పండుగ కు మరో పేరు "ఈద్ ఉల్ ఫిత్ర". ఈ నెలలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఫిత్రా జకాత్ దానధర్మాలు చేస్తుంటారు. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ' పండుగ ' అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే..... దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ' పండుగ ' మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే " రంజాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.ముస్లింలు చాంద్రమాన కేలండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల రంజాన్ దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే " రంజాన్ మాసం
What's Your Reaction?