సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయని అంబులెన్స్
దాదాపుగా 20 రోజుల నుండి అందుబాటులో లేని ప్రభుత్వ అంబులెన్స్
మనభారత్ న్యూస్ ప్రతినిధి, 13 అక్టోబరు 2024, సూర్యాపేట , తెలంగాణ : అత్యవసర సమయంలో అందుబాటులో ఉండవలసిన అంబులెన్స్ షెడ్డుకు పరిమితమైంది.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సరైన అంబులెన్స్ అందుబాటులో లేక రోగులు, గర్భిణీలు అనేక రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు... దాదాపుగా గత 20 రోజుల నుండి షెడ్డుకే అంబులెన్స్ పరిమితమైంది... జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిను ప్రతినెల తనిఖీలు చేస్తు అనేక రకాలుగా సూచనలు ఇస్తూ ఏమైనా సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేస్తున్న అందుకు విరుద్ధంగా ఆసుపత్రి తీరు ఉందని చెప్పవచ్చు...
ఆసుపత్రిలో అంబులెన్స్ పనిచేయడం లేదని తెలిసిన పట్టించుకోరా..?
ఆసుపత్రిలో అంబులెన్స్ పనిచేయడం లేదని ఆస్పత్రి యజమాన్యం కు తెలిసిన ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైద్యుల తీరుపై అసంతృప్తి
అనారోగ్యంతో వైద్యం కోసం వచ్చే ప్రజలు వైద్యుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సేవలు అందించే సమయంలో విసుక్కుంటున్నారని కొంతమంది వైద్యులు అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనారోగ్యానికి గురైన ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్.
ఇప్పటికైనా మూలన పడ్డ అంబులెన్స్ ను అందుబాటులో తెచ్చే విధంగా జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని ఆసుపత్రికి వచ్చే ప్రజానీకం కోరుతున్నారు. అంబులెన్స్ పని చేయడం లేదని తెలిసినా అందుబాటులోకి తీసుకురాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి వారి వల్ల ప్రజా పాలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు...
What's Your Reaction?