హైదరాబాద్ లో కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ, హాజరైన ప్రియాంక గాంధీ
మనభారత్ న్యూస్,09 మే 2023, హైదరాబాదు : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తొలిసారిగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకూ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన ప్రియాంక గాంధీ హైదరాబాద్‌లో కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో పాల్గొన్నారు.
తెలంగాణలోని నిరుద్యోగులకు భరోసా కల్పించడానికే ప్రియాంకగాంధీ హైదరాబాద్ వస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ సభలో ప్రియాంకగాంధీ సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు. యువ సంఘర్షణ సభకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు.
కార్యకర్తల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇతర ముఖ్యనేతలు స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట ఎయిర్ పోర్ట్ ను హెలికాప్టర్ లో సరూర్ నగర్ గ్రౌండ్ కు చేరుకున్నారు. ముందుగా ప్రమాదవశాత్తు మరణించిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు.
హైదరాబాద్ యూత్ డిక్లరేషన్
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఎల్బీనగర్‌కు వెళ్లారు. ఎల్బీ నగర్‌లో తెలంగాణ పోరాటంలో అమరుడైన శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించాపు. అనంతరం శ్రీకాంతాచారి విగ్రహం నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకూ ఆమె పాదయాత్రగా వెళ్లారు. సరూర్ నగర్ గ్రౌండ్ లో కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి వంటివి ఈ సభలో ప్రకటించనున్నారు.
ప్రియాంక గాంధీ విడుదల చేసిన డిక్లరేషన్ హైలెట్స్
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగువేల నిరుద్యోగ భృతి ఇస్తాం
ఖమ్మం,ఆదిలాబాద్,మెదక్ ,రంగా రెడ్డి జిల్లాల్లో కొత్త యూనివర్సిటీలు
ఆర్టీసీ, పోలీసు సిబ్బంది పిల్లలకు వరంగల్ హైదరాబాద్ లో విశ్వవిద్యాలయాలు
బాసర ట్రిపుల్ ఐటీ తరహాలో మరో నాలుగు వర్సిటీల ఏర్పాటు చేస్తాం
ప్రతి ఏడాది జూన్ 2న ఉద్యోగాల నోటిఫికేషన్ లు జారీ
సెప్టెంబర్ 17న నియామక పత్రాల అందజేత
యువకులకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు, అమరుల కుటుంబాలకు నెలకు 25 వేల పెన్షన్
విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ
What's Your Reaction?