75 ఏళ్లలో మొదటిసారి హజ్ యాత్రను రద్దు చేసుకున్న పాక్..!

May 8, 2023 - 21:59
 0
75 ఏళ్లలో మొదటిసారి హజ్ యాత్రను రద్దు చేసుకున్న పాక్..!

మనభారత్ న్యూస్, 09 మే 2023 : పాకిస్థాన్ ఆర్థికంగా రోజు రోజుకు దిగజారిపోతోంది. తాజాగా 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్థాన్ తన హజ్ కోటాను సౌదీ అరేబియాకు అప్పగించింది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఈ ఏడాది వేలాది మంది పాకిస్థానీయులు తీర్థయాత్రకు దూరమయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పాకిస్తాన్ కేటాయించిన 8,000 మంది హజ్ కోటా సీట్లను తిరిగి సౌదీ అరేబియాకే ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్ ప్రభుత్వానికి $24 మిలియన్లు ఆదా అవుతుంది. ప్రభుత్వ స్కీమ్ కోటాను తిరిగి ఇస్తున్నట్లు మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదికల ప్రకారం, యాత్రికుల వసతి కోసం ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన అదనపు మొత్తాన్ని మిలియన్ల డాలర్లలో ఆదా చేసేందుకు ఈ చర్య తీసుకున్నారు. ఫెడరల్ ప్రభుత్వం హజ్ దరఖాస్తుదారులకు ఎటువంటి డబ్బు ఇవ్వడం జరగదని ముందుగా ప్రకటించింది.

కోటాను పెంచాలన్న ప్రభుత్వ దీర్ఘకాల డిమాండ్‌ను అనుసరించి ఈ ఏడాది హజ్ తీర్థయాత్రలో పాకిస్థాన్‌కు పూర్తి వాటా లభించింది. బెయిలౌట్ కార్యక్రమం తొమ్మిదవ సమీక్షను ముగించడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి పాకిస్తాన్‌తో కలిసి పని చేస్తోంది.

2019లో అంగీకరించిన $6.5 బిలియన్ల ప్రోగ్రామ్ నవంబర్‌లో నిలిచిపోయింది. $1.1 బిలియన్ల నిధుల కోసం ఫిబ్రవరి నుంచి పాకిస్తాన్ , IMF ఆర్థిక విధాన పరమైన విషయాలను చర్చిస్తున్నాయి. పాక్ లో ఏప్రిల్‌లో అత్యధికంగా 36.4 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. పాకిస్తాన్ తన బాహ్య చెల్లింపు చేయ్యాలంటే IMF నిధులు చాలా కీలకం. ప్రస్తుత IMF కార్యక్రమం జూన్‌లో ముగిసేలోపు పాకిస్తాన్‌కు అదనంగా $1.4 బిలియన్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

2023లో పాక్‌ రూపాయి డాలర్‌తో పోలిస్తే 20 శాతం పడిపోయింది. ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీల్లో పాక్ కరెన్సీ ఒకటిగా నిలిచింది. గత నెలలో పాక్‌ రూపాయి జీవిత కాల కనిష్ఠానికి చేరిన సంగతి తెలిసిందే. పాక్ లో రవాణా ధరలు 56.8 శాతం పెరిగాయి. ఇక ఆహార ద్రవ్యోల్బణం కూడా గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే 48.1 శాతం పెరిగింది. దుస్తులు, పాదరక్షల ధరలు 21.6 శాతం, హౌసింగ్‌, నీరు, విద్యుత్తుకు సంబంధించిన ధరలు 16.9 పెరిగాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News